వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలన్ మస్క్ జలాంతర్గాములు పనిచేయవు.. తీవ్ర విమర్శలు చేసిన బ్రటిష్ డైవర్

|
Google Oneindia TeluguNews

థాయ్‌ల్యాండ్ గుహల్లో కొంతమంది చిన్నారులు చిక్కుకున్న రెండువారాల తర్వాత సురక్షితంగా బయటకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే చిన్నారులు బయటకు తీసుకురావడం వెనక చాలామంది కృషి చేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఎలన్ మస్క్ కూడా తమ సంస్థ తయారు చేసిన మినీ సబ్‌మెరైన్‌ను థాయ్ గుహల వద్ద వదిలి వచ్చినట్లు ట్వీట్ చేశాడు. దీనిపై మరో బ్రిటీష్ నిపుణుడు వెర్నన్ అన్స్‌వర్త్ నిప్పులు చెరిగారు.

ఎలన్ మస్క్‌ తయారు చేసిన మినీ జలాంతర్గామి ఎందుకూ పనికిరాదని తేల్చేశారు. అంతేకాదు మస్క్ మినీ సబ్‌మెరైన్ 5 నుంచి 6 అడుగుల వరకు మాత్రమే ఉందని అది ఈ గుహలను చేధించుకుని వెళ్లలేదని వివరించాడు. తను ఈ గుహలపై సుదీర్ఘకాలంగా పరిశోధనలు చేసినట్లు వెర్నన్ అన్స్‌వర్త్ తెలిపారు. అన్స్ వర్త్ చేసిన విమర్శలపై ఎలన్ మస్క్ స్పందించారు.

Elon Musks mini submarines wouldnt have worked in thai cave rescue op:Vernon Unsworth

తమ సంస్థ తయారు చేసిన ఈ సబ్ మెరైన్ పనిచేస్తుంది అంటూ వాదించడమే కాదు... అది ఆ గుహల్లోనే పనిచేసే తీరును కూడా చూపిస్తానంటూ మస్క్ సవాల్ విసిరారు. అంతేకాదు పిల్లల ప్రాణాలు కాపాడాడని చెప్పుకుంటున్న ఈ బ్రిటీషు పెద్ద మనిషిని సహాయకచర్యలు జరిగే ప్రాంతంలో ఎక్కడా చూడలేదని మస్క్ మరో ట్వీట్ చేశారు. మస్క్ బృందం థాయ్ కేవ్స్ వద్దకు వెళ్లిన సమయంలో థాయ్ డైవర్స్, మిగతా అధికారులు తమ వెంటే ఉన్నారని గుర్తు చేశారు.

Elon Musks mini submarines wouldnt have worked in thai cave rescue op:Vernon Unsworth

తాము గుహల దగ్గరికి వెళ్లే సరికి నీటి లెవెల్ కూడా బాగా తగ్గిపోయిందని... ఇంకా ఉధృతంగా పారి పొర్లలేదని మస్క్ చెప్పారు. అంటే ఈత కొడుతూనే ఐదవ గుహ లోపలికి వెళ్లే అవకాశముందని చెప్పారు. తాను నిజంగానే పిల్లలను కాపాడాననిన చెబుతున్న అన్స్‌వర్త్‌ ఆ చివరి వీడియోను విడుదల చేయాలని సవాల్ విసిరారు. అదేసమయంలో పిల్లలను కాపాడి బయటకు తీసుకొచ్చిన ఇతర డైవర్లను ఎలన్ మస్క్ అభినందించారు.

English summary
Vernon Unsworth, 63, co-led the operation to save the schoolboys from the cave and earlier accused Musk of making a "PR stunt" and said the Tesla CEO can "stick his submarine where it hurts".The financial broker told"It just had absolutely no chance of working. He had no conception of what the cave passage was like.The tech billionaire later ranted on Twitter that he would make a video proving the sub would have worked, adding: "Sorry pedo guy, you really did ask for it". The tweet has since been deleted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X