• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘స్పేస్‌ ఎక్స్‌’ ప్రయోగం విజయవంతమే.. కానీ ఎలాన్ మస్క్ కారు ఏమైందంటే...

By Ramesh Babu
|
  SpaceX's Falcon Heavy Landing

  ఫ్లోరిడా: ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ 'స్పేస్ ఎక్స్' మంగళవారం విజయవంతంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ 'ఫాల్కన్ హెవీ'ని అంతరిక్షంలోకి ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగం అనంతరం స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు ప్రశంసించారు.

  చరిత్ర సృష్టించిన 'స్పేస్ ఎక్స్'! అత్యంత శక్తివంతమైన రాకెట్ ద్వారా అంగారకుడి వద్దకు కారు!చరిత్ర సృష్టించిన 'స్పేస్ ఎక్స్'! అత్యంత శక్తివంతమైన రాకెట్ ద్వారా అంగారకుడి వద్దకు కారు!

  ఈ ప్రయోగం అనంతరం రెండున్నర నిమిషాలకు ఫాల్కన్ హెవీ రాకెట్‌కు అమర్చిన రెండు బూస్టర్లు విడిపోయి విజయవంతంగా భూమిని చేరుకున్నాయి. మరో బూస్టర్ సముద్రంలోని డ్రోన్ షిప్‌పైకి వచ్చి చేరాల్సి ఉండగా, అలా జరగలేదు. ఈ బూస్టర్ విఫలమై కాలిపోయినట్లు తరువాత స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తెలిపారు.

  భూమికి సూర్యుడే పెనుముప్పు! సౌర పవనాలతో బలహీనమవుతున్న భూఅయస్కాంత క్షేత్రం!?భూమికి సూర్యుడే పెనుముప్పు! సౌర పవనాలతో బలహీనమవుతున్న భూఅయస్కాంత క్షేత్రం!?

  అంతేకాదు, ఈ ప్రయోగంలో భాగంగా ఎలాన్ మస్క్ ఓ టెస్లా కారును కూడా అంతరిక్షంలోకి పంపించారు. దాన్ని అంగారక గ్రహ కక్షలోకి ప్రవేశపెట్టడం అసలు లక్ష్యం. అయితే ఇప్పుడు ఇది కూడా విఫలమైనట్లు తెలుస్తోంది.

  విఫలమైన ఎలాన్ మస్క్ లక్ష్యం...

  విఫలమైన ఎలాన్ మస్క్ లక్ష్యం...

  ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌ను తయారు చేయడమేకాకుండా దాని ద్వారా ‘రోడ్ స్టర్' అనే ఓ టెస్లా కారును స్పేస్ ఎక్స్ అంతరిక్షంలోకి పంపించిన సంగతి తెలిసిందే. ఈ కారును అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టాలనేది స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ లక్ష్యం. అయితే ఇప్పుడు ఈ లక్ష్యం నెరవేరకుండా పోయింది.

   కక్ష్య తప్పిన ‘రోడ్ స్టర్' కారు...

  కక్ష్య తప్పిన ‘రోడ్ స్టర్' కారు...

  స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ లక్ష్యం విఫలమైంది. ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశించిన టెస్లా కారు ‘రోడ్ స్టర్' సరైన కక్ష్యలోకి ప్రవేశించలేదు. తొలుత ప్రయోగం విజయవంతం అయిందని సంస్థ ప్రతినిధులు, స్పేస్ సైంటిస్టులు భావించారు. కానీ ఆ తరువాత అసలు విషయం తెలిసింది. అదేమిటంటే.. ఫాల్కన్ హెవీ రాకెట్ ఈ కారును అంగారక గ్రహ కక్ష్యలో కాకుండా దానికి అవతలున్న ఆస్టరాయిడ్ ప్రభావిత ప్రాంతంలో విడిచిపెట్టిందట.

   వంద కోట్ల ఏళ్లు అంతరిక్షంలోనే...

  వంద కోట్ల ఏళ్లు అంతరిక్షంలోనే...

  అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు అంతరిక్షంలోకి పంపించిన కారు కనీసం వంద సంవత్సరాల పాటు అలా అంగారక గ్రహ కక్షలో తిరుగుతూ ఉండేది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఏలియన్స్ ఈ కారును చూస్తే.. దాన్ని భూమిపై ఉన్న మానవులు పంపించారని వారికి అర్థమయి ఉండేది. కానీ అనుకోకుండా చిన్న పొరపాటు జరిగిపోయింది. ఫలితంగా ఈ కారు నిర్ణీత అంగారక గ్రహ కక్ష్యలో కాకుండా ఇంకా దూరం ప్రయాణించింది.

  గతి తప్పిన ఆ కారు ఏమవుతుంది?

  ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశించిన టెస్లా కారు ‘రోడ్ స్టర్' ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది. నిర్ణీత అంగారక గ్రహ క్షక్ష్యను దాటి ప్రస్తుతం ఇది పయనిస్తోంది. ఒకవేళ ఇది నిర్ణీత అంగారక గ్రహ కక్ష్యలోకి గనుక ప్రవేశించి ఉంటే.. కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత అయినా ఏదో ఒక రోజు ఈ కారు అంగారక గ్రహంపైకి చేరి ఉండేది. కానీ ఇప్పుడిక ఆ అవకాశం లేదు. ఒకవేళ ఈ కారు ఇలాగే అంతరిక్షంలో పయనిస్తూ సౌర వ్యవస్థ ప్రభావిత ప్రాంతంలోకి గనుక ప్రవేశిస్తే.. సూర్యుడి శక్తివంతమైన కాస్మిక్ కిరణాలు తగిలి ముక్కలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  English summary
  The Tesla Roadster that Elon Musk blasted into space aboard the SpaceX Falcon Heavy rocket blasted past the orbit of Mars and is headed toward the dwarf planet Ceres, in our solar system’s asteroid belt. “Third burn successful,” SpaceX and Tesla CEO Musk tweeted Feb. 7 about an ignition of the rocket carrying the Roadster.“Exceeded Mars orbit and kept going to the Asteroid Belt.” The good news is that the Martians are probably less at risk of having an innovative Earthling’s fancy four-wheeler landing on their heads, as it appears the Roadster’s orbit will be further than Mars than planned.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X