వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యుడి కక్ష్యలో భ్రమణం పూర్తి చేసిన ఎలన్ మస్క్ కారు

|
Google Oneindia TeluguNews

18 నెలల క్రితం ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ మొదటి తరం టెస్లా రోడ్‌స్టర్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ వాహనంలో ఓ కారును అమర్చారు. అందులో ఓ డమ్మీ బొమ్మకు స్పేస్‌ సూట్ ధరించి కూర్చోబెట్టి సూర్యుడి దగ్గరకు పంపారు. దానిపేరు "స్టార్ మాన్" అని పెట్టారు. ప్రస్తుతం అది సూర్యుడి చుట్టూ తన మొదటి భ్రమణాన్ని పూర్తి చేసి విశ్వం చివరకు వెళ్లే ప్రయత్నంలో ఉంది. గతేడాది ఫిబ్రవరిలో స్టార్‌మ్యాన్ స్పేస్‌ఎక్స్‌కు చెందిన భారీ ఫాల్కన్ రాకెట్‌లో తన ప్రయాణంను మొదలుపెట్టింది.

ఇక ఫాల్కన్‌ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం తొలి కక్ష్య పూర్తి చేసేందుకు ఒస ఏడాదిన్నర్ర సమయం తీసుకుందని తెలుస్తోంది. మొత్తంమీద ఈ రాకెట్ 763 మిలియన్ మైళ్లు దూరం ప్రయాణించింది. ఇంకా దీని ప్రయాణం కొనసాగుతోంది. గంటకు 25,749 మైళ్ల వేగంతో ఈ రాకెట్ ప్రయాణిస్తోంది. ప్రస్తుతం అది భూమికి 185 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. సూర్యుడి కక్ష్యను చుట్టేసిన స్టార్‌మ్యాన్... ఇక మార్స్ గ్రహం వైపు పయనిస్తోంది. అయితే కారు అందులోని స్టార్ మ్యాన్‌ల పరిస్థితి ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే కారు ముక్కలై ఉంటుందని అంచనావేశారు. ఎందుకంటే మార్స్ కక్ష్యను చేరుకోవాలంటే కారు 250 మిలియన్ మైళ్లు ప్రయాణించాల్సి ఉంటుందని అది సాధ్యం కాని పని అని వారు చెబుతున్నారు.

Elon Musk starman completes a full orbit around the sun

ఇదిలా ఉంటే స్పేస్‌ఎక్స్ పంపిన టెస్లా కారు అంతరిక్షంలో ఒక వస్తువుగా మారిపోతుందని నాసా పేర్కొంది. ఇక స్టార్‌మ్యాన్ 400 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారక గ్రహంవైపు వెళుతోంది. ఇక అంతరిక్షంలోకి కారు వెళ్లాక అక్కడ అది ముక్కలైపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షంలో రేడియేషన్‌ను అడ్డుకునే శక్తి ఏదీ ఉండదు కనుక కారు అక్కడే ముక్కలై పోతుందని అంచనా వేస్తున్నారు.

English summary
It’s been over a year since Elon Musk launched a red sports car into space to show off the capabilities of SpaceX’s powerful new rocket, the Falcon Heavy.According to a website that’s been tracking its journey since day one, Musk’s Roadster and the dummy ‘Starman’ are now more than 185 million miles from Earth and have completed a full orbit around the sun.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X