వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ భారీకాయురాలు.. ఎమాన్‌ అహ్మద్‌ కన్నుమూత

ప్రపంచంలోనే అత్యంత భారీకాయురాలు ఎమాన్‌ అహ్మద్‌ కన్నుమూశారు. ఈజిప్ట్‌కు చెందిన ఎమాన్‌ ను బరువు తగ్గించే చికిత్స నిమిత్తం 2016లో ముంబైకి తీసుకొచ్చారు. ఆమె సగం బరువు కూడా తగ్గారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అబుదాబి: ప్రపంచంలోనే అత్యంత భారీకాయురాలు ఎమాన్‌ అహ్మద్‌ కన్నుమూశారు. ఈజిప్ట్‌కు చెందిన ఎమాన్‌ ను బరువు తగ్గించే చికిత్స నిమిత్తం 2016లో ముంబైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ముంబైలోని సైఫీ ఆసుపత్రిలో కొంతకాలం ఆమెకు చికిత్సను అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెని అబుదాబిలోని బుర్జీల్‌ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.

Eman Ahmed, Once World's Heaviest Woman, Dies In Abu Dhabi

కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఆమె చనిపోయినట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఎమాన్‌ సగం బరువు తగ్గిన సంగతి తెలిసిందే.

తరువాత ఆమె తనంతట తానే తినగలిగే స్థితికి చేరిందని గతంలో వైద్యులు కూడా తెలిపారు. ఆ తరువాత దుబాయ్ లోని మరో అధునాతన ఆసుపత్రిలో మరింత మెరుగైన చికిత్స కోసం అంటూ ఆమెను ఆమె బంధువులు జూన్‌లో అబుదాబికి తరలించారు. మరికొంతకాలంలో పూర్తిగా కోలుకుంటుంది అనుకునేలోపే ఎమాన్‌ కన్నుమూసింది.

English summary
World's heaviest woman Eman Ahmed, who came to India for weight-loss surgery and then flew to Abu Dhabi for further treatment amid controversy, has died at 37. Doctors said she died today of complications including heart disease and kidney dysfunction. Eman Ahmed had been in Abu Dhabi since May. Reports in the UAE media had claimed that she was seen "dancing in her bed" last month. Ms Ahmed weighed around 500 kilograms when she arrived in Mumbai in February from her hometown Alexandria in Egypt. She was treated at the city's famed Saifee hospital by a team of around 15 doctors led by renowned specialist Muffazal Lakdawala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X