హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్, ఖమ్మం వాసి: ఆమె టర్కీ నుండి రిటర్న్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న తొమ్మిది మందిని బెంగళూరులో అరెస్టు చేశారు. వారిలో ఐదుగరు పిల్లలు, ఓ మహిళ ఉన్నారు. చెన్నైకి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ అహిద్‌‌తోపాటు అతడి భార్య, పిల్లలు సహా, తెలంగాణకు చెందిన జావీద్‌ బాబా, హసన్‌కు చెందిన ఇబ్రహీం నౌహాల్‌ (24)లను సీబీఐ, సీసీబీ బృందాలు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నాయి.

ఖమ్మం జిల్లాకు చెందిన జావెద్‌ బాబా బెంగళూరులో అరెస్టవడంతో ఆ జిల్లాలో కలకలం రేగింది. అతడికి నిషేధిత సిమి ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్నారు. దీంతో జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. అతడి కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనతో దర్యాప్తు చేసిన పోలీసులకు 14 మంది బంగ్లాదేశీయులు జిల్లాలో ఉన్నట్లు తేలింది.

వారి కదలికలపై నిఘావర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. డిసెంబర్‌ 24న ఐఎస్‌లో చేరడానికి ఇస్తాంబుల్‌ వెళుతున్న తొమ్మిదిమందిని సిరియా భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. వారిని భారత్‌కు పంపించాయి. తిరిగొచ్చిన వారిని ఇక్కడి పోలీసులు అరెస్టు చేశారు.

Engineers among 9 ISIS bound Indians deported by Turkey

ఆ యువతికి టర్కీ నుండి తిరిగొచ్చింది!

తుపాకీపై మోజుతో హైదరాబాదుకు చెందిన యువతి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐస్ (ఐసిస్)లో చేరిన, వెనక్కి వచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. సదరు ఇరవై ఏళ్ల యువతి ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్లిందని, కానీ ఎలాంటి ట్రెయినింగ్ తీసుకోలేదని నగర సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

ఆమె ఐసిస్‌లో చేరినట్లుగా ఎలాంటి సమాచారం లేదన్నారు. సమాచారం మేరకు.. ఐసిస్‌లో చేరుదామని వెళ్లిన ఆమె.. అక్కడి పరిస్థితులను చూసి, విషయం అర్థమై తిరిగి వచ్చిందని అంటున్నారు. ఆన్ లైన్లో ఇతరుల ద్వారా ప్రభావితమై ఆమె వెళ్లి ఉంటుందన్నారు. టర్కీకి వెళ్లాక ఆమె తన మనసు మార్చుకొని ఉంటుందని భావిస్తున్నారు.

కాగా, సిరియాకు చెందిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ హైదరాబాద్‌ యువతీ యువకులను టార్గెట్‌ చేసుకుంది. యువతీ యువకులను ఉగ్రవాదంవైపు మళ్లించి వారిని ఉగ్రవాదులుగా మార్చేందుకు కుట్రలు చేస్తోంది. ఇందుకు సోషల్‌ వెబ్‌సైట్లను సాధనంగా ఉపయోగించుకుంటోంది.

ఫెస్‌బుక్‌ అడ్డాగా యువతీ యువకులకు ఉగ్రవాదం వైపు గాలం వేస్తున్నారు. ఈ విధంగానే ఉగ్రవాదుల ఆకర్షణకు లోనై నలుగురు హైదరాబాద్‌ యువకులు ఐసిస్‌లో చేరేందుకు ఇరాక్‌ వెళ్తుండగా కలకత్తాలో ఇంటెలీజెంట్‌ అధికారులు పట్టుకున్నారు.

మోరవైపు, ఐసిస్‌పై సానుభూతితో ఆ సంస్ధలో చేరేందుకు దుబాయ్‌ వెళ్తూ ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులకు పట్టుబడ్డాడు. ఉగ్రవాద నియంత్రణకు అధికారులు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంత నిఘా పెట్టినా ఎంతో కొంతమంది ఉగ్రవాదం వైపు మళ్లుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

English summary
Hyderabad police commissioner Mahender Reddy said the 20 year old woman who wanted to join the IS did not receive any training.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X