వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా స్ట్రెయిన్ టెన్షన్.. ఇంగ్లండ్‌లో లాక్ డౌన్.. ఫిబ్రవరి 15 వరకు: ప్రధాని బోరిస్

|
Google Oneindia TeluguNews

కరోనా స్ట్రెయిన్ కలవరపెడుతోంది. వైరస్ బ్రిటన్‌లో బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. లాక్ డౌన్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగుతోందని తెలిపారు. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని జాన్సన్ చెబుతున్నారు. దాదాపు 56 మిలియన్ ప్రజలు లాక్ డౌన్‌లో ఉండనున్నారు. ఇప్పటికే ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలను మూసివేశారు.

Recommended Video

New Corona Strain : 5 People Tested Corona Positive Who Came From Britain To India
England-Wide Lockdown, UK PM Boris Johnson announces

కరోనా వైరస్ స్ట్రెయిన్ బ్రిటన్‌లో బయటపడ్డ సంగతి తెలిసిందే. దీంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. కరోనా వైరస్ కోసం టీకా ఇంకా రాకపోగా.. కొత్త స్ట్రెయిన్ టెన్షన్ పుట్టిస్తోంది. ఇదీ కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో 38 కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులను గుర్తించారు. ఇవీ రోజు రోజుకు వ్యాపిస్తూనే ఉన్నాయి.

దేశంలో కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో 9 మందికి స్ట్రెయిన్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటివరకు దీని బారినపడినవారి సంఖ్య 38కి చేరింది. కేరళలో తొలిసారి ఆరుగురికి స్ట్రెయిన్‌ సోకినట్లు ప్రభుత్వం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒకే కుటుంబంలోని ఐదుగురికి నిర్ధారణ అయింది. వీరిలో రెండేళ్ల చిన్నారి ఉండటం విశేషం.

English summary
56 million people in England will return to a full coronavirus lockdown, possibly until mid-February, to try to cut spiralling infection rates, Prime Minister Boris Johnson said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X