• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇమ్రాన్‌ఖాన్‌కు భారత్ గట్టి జవాబు, ఆర్మీ రెండేళ్ల క్రితమే.. రెహామ్ ఖాన్ షాకింగ్

By Srinivas
|

న్యూఢిల్లీ/కరాచి: భారత్‌తో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నామని చెబుతూనే కాశ్మీర్ ఇష్యూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పీటీఐ అధినేత, పాకిస్తాన్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారత్ గట్టి జవాబు ఇచ్చింది. తీవ్రవాదరహిత, హింసలేని దక్షిణాసియా కోసం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పని చేస్తుందని ఆశిస్తున్నామని భారత్ పేర్కొంది.

భారత్ అడుగేస్తే, మేం రెండు: కాబోయే పాక్ ప్రధాని ఇమ్రాన్, భారత్ మీడియా, కాశ్మీర్‌పై కీలకవ్యాఖ్యలు

తద్వారా ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ ద్వారా హెచ్చుమీరుతున్న తీవ్రవాదాన్ని అణదొక్కితే రెండు దేశాల మధ్య సామరస్య వాతావరణం ఏర్పడుతుందని అభిప్రాయపడింది. ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ వ్యాఖ్యలపై స్పందించలేదు. తద్వారా కాశ్మీర్ విషయంలో వారికి సంబంధం లేదని భారత్ అభిప్రాయపడింది.

అందుకోసం కొత్త ప్రభుత్వం పాటుపడుతుందని భారత్ ఆకాంక్ష

అందుకోసం కొత్త ప్రభుత్వం పాటుపడుతుందని భారత్ ఆకాంక్ష

ఈ మేరకు శనివారం కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యంపై పాకిస్తాన్ ప్రజల నమ్మకాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. తమ పొరుగున ఉన్న పాకిస్తాన్ సంపన్నమైన, ప్రగతిశీల దేశంగా, ప్రశాంత దేశంగా ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొంది. కొత్త ప్రభుత్వం రక్షణ, సుస్థిర, అభివృద్ధి గల తీవ్రవాదరహిత, హింసలేని దక్షిణాసియా నిర్మాణం కోసం పాటుపడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.

పాక్ ఎన్నికల ఫలితాలపై అమెరికా స్పందన

పాక్ ఎన్నికల ఫలితాలపై అమెరికా స్పందన

పాకిస్తాన్‌లో ఎన్నికలు జరిగిన తీరుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించారని, పాకిస్తాన్ దీర్ఘకాల సుస్థిరత, సుసంపన్నతల కోసం బలమైన ప్రజాస్వామిక, పౌర పాలన వ్యవస్థలు అవసరమని, ఎన్నికల్లో ఉగ్రవాదులు పాల్గొనడంపై తమకు గట్టి అభ్యంతరాలు ఉన్నాయని, బ్యాలెట్‌ పెట్టెల ద్వారా వారిని ఓటర్లు తిరస్కరించిన తీరును అభినందిస్తున్నామని, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నౌవెర్ట్ అన్నారు.

 ముప్తీ ఫరూక్ అబ్దుల్లా సూచన

ముప్తీ ఫరూక్ అబ్దుల్లా సూచన

పాక్ ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు లభించలేదని యూరోపియన్ యూనియన్ పర్యవేక్షక బృందం ప్రధాన పరిశీలకులు మైఖేల్ గెహ్లర్ అన్నారు. కాశ్మీర్‌లో రక్తపాతానికి చరమగీతం పాడేందుకు ఇమ్రాన్ ఖాన్ చాచిన స్నేహహస్తాన్ని భారత ప్రధాని మోడీ అందుకోవాలని జమ్ము కాశ్మీర్ మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లా సూచించారు.

ఇమ్రాన్ పార్టీపై రెహామ్ ఖాన్ తీవ్ర ఆరోపణలు

ఇమ్రాన్ పార్టీపై రెహామ్ ఖాన్ తీవ్ర ఆరోపణలు

పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ గెలవడంపై విపక్షాలతో పాటు ఆయన మాజీ భార్య రెహామ్ ఖాన్ కూడా మండిపడ్డారు. రిగ్గింగ్ వల్ల ఇమ్రాన్ పార్టీ గెలిచిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మాజీ భార్య కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీ చేతిలో ఇమ్రాన్ కీలుబొమ్మ అన్నారు. ఇమ్రాన్‌ను ప్రధానిగా చేయాలని పాకిస్తాన్ ఆర్మీ రెండు మూడేళ్ల క్రితమే నిర్ణయించిందన్నారు. ఇమ్రాన్ పార్టీ తరఫున అనామకులు గెలిచారని, బాగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With former cricket captain Imran Khan all set to become Prime Minister of Pakistan, India on Saturday said it hoped the new Pakistani government would work towards building a secure South Asia free of terror and violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more