వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంటువ్యాధులు, యుద్ధం- చరిత్రలో ముస్లింల దైవారాధనకు అడ్డుపడింది ఇవే...

|
Google Oneindia TeluguNews

ఇవాళ్టి నుంచి సౌదీ అరేబియాతో పాటు పలు ముస్లిం దేశాల్లో రంజాన్ మాసం ప్రారంభమైంది. కాలమాన లెక్కల కారణంగా రేపటి నుంచి భారత్ లో రంజాన్ మాసం మొదలుకాబోతోంది. అయితే పవిత్ర మాసంలో మసీదులకు వెళ్లాల్సిన ముస్లింలు... కరోనా భూతం కారణంగా ఇళ్ల వద్దే ఉంటూ ప్రార్ధనలు జరుపుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. అంటు వ్యాధి కారణంగా ఒకరితో ఒకరు ఆలింగనం చేసుకునే పరిస్దితి కూడా లేదు. అయితే ప్రపంచ చరిత్ర గతిని గమనిస్తే అంటువ్యాధులు, యుద్ధం కారణంగా ముస్లింలు దైవారాధనకు దూరంగా ఉండాల్సిన పరిస్ధితులు నెలకొన్నట్లు అర్దమవుతుంది.

 భారత్ లో కరోనా వ్యాప్తి...

భారత్ లో కరోనా వ్యాప్తి...

కరోనా వ్యాప్తి ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది నిరుద్యోగులుగా మారిపోయారు. జనం ప్రయాణాలు మానుకున్నారు. బహిరంగ ప్రదేశాలన్నీ నిర్మానుష్యమైపోయాయి. ఉద్యోగులు ఇళ్ల వద్ద నుంచే పని చేస్తున్నారు. సెల్ఫ్ ఐసోలేషన్ తో పాటు సామాజిక దూరం పాటించాల్సిన పరిస్దితి. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా ప్రభుత్వాలు తమ ప్రజల కదలికలపై ఆంక్షలు విధించాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 కోట్ల మంది లాక్ డౌన్ లోనే ఉండిపోయారు. అదే సమయంలో ముస్లింలతో పాటు పలు మతాలకు సంబంధించిన వారు వాస్తవాన్ని తెలుసుకుని మసలుకుంటున్నారు.

 కరోనా వ్యాప్తి- రంజాన్ మాసం...

కరోనా వ్యాప్తి- రంజాన్ మాసం...

అదే సమయంలో కరోనా వైరస్ కారణంగగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 కోట్ల మంది ముస్లిం జనాభాపై పవిత్ర రంజాన్ మాసంలో ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది. దీంతో ఇప్పుడు రంజాన్ మాసాన్ని వివిధ కొత్త మార్గాల్లో ఆచరించేందుకు ముస్లింలు సిద్దమవుతున్నారు. వీరంతా మసీదుల్లో సామూహిక ప్రార్ధనలకు దూరంగా సామాజిక దూరం పాటిస్తూ ఉపవాస దీక్షలు చేసుకుంటున్నారు. చివరికి పవిత్ర మాసంలో చేసే దాన ధర్మాలు కూడా సామాజిక దూరంతోనే చేసుకోవాల్సిన పరిస్దితి. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో సామూహికంగా జనం గుమికూడే అవకాశం ఉన్నందున మసీదులు మూతపడ్డాయి. శుక్రవారం ప్రార్ధనలు కూడా చేసుకునే వీలు లేకుండా పోయింది. సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న గ్రాండ్ మాస్క్ లో ఏడాది పొడవునా సాగే, మినీ హజ్ యాత్రగా పిలుచుకునే ఉమ్రా యాత్ర కూడా నిరవధికంగా రద్దు చేసేశారు. సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న గ్రాండ్ మాస్క్ తో పాటు మదీనాలో మహమ్మద్ ప్రవక్త మసీదుగా పిలిచే అల్ మసీద్ అన్ నవాబీలో జనం లేకుండానే పవిత్ర రంజాన్ తరావీ ప్రార్ధనలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇమామ్ లు మాత్రమే వీటిని నిర్వహించనున్నారు.

 ప్రపంచ ముస్లిం చరిత్రలోనే ...

ప్రపంచ ముస్లిం చరిత్రలోనే ...

గత 1400 ఏళ్ల ముస్లిం చరిత్రను చూసుకుంటే ఇవన్నీ అసాధారణ సంఘటనలే. రంజాన్ మాసంలో ఇంత పెద్ద ఎత్తున ప్రార్ధనలు రద్దు కావడం బహుశా చరిత్రలోనే ఎన్నడూ జరగలేదని పెద్దలు చెబుతున్నారు.

కానీ చరిత్రను ఓసారి పరిశీలిస్తే పరిమిత స్ధాయిలో మతపరమైన సమూహాలు, ప్రార్ధనలు రద్దు చేసిన సందర్భాలు కొన్ని మనకు కనిపిస్తాయి.
గతంలో మసీదులు మూసేయడం, సామూహికంగా సమావేశాలు వంటివి రద్దయిన ఘటనలు చాలా సార్లు జరిగిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి.గతంలో ప్రకృతి విపత్తులు, వరదలు, అంటు వ్యాధుల కారణంగా మతపరమైన కార్యక్రమాలు రద్దయిన ఘటనలు ఉన్నాయని
ఖతార్ రాజధాని దోహాలో ఉన్న హమద్ బిన్ ఖలీఫా యూనివర్శిటీ ప్రొఫెసర్ ముతాజల్ ఖతీబ్ చెప్పారు.

ఖుర్మాతియన్ దాడి, 930

ఖుర్మాతియన్ దాడి, 930

ప్రస్తుత బహ్రెయిన్, అప్పటి ఉత్తర అరేబియాలో ఖుర్మాతియన్ తెగకు చెందిన వారు ముస్లింల పవిత్ర స్ధలమైన మక్కాపై అసాధారణ రీతిలో దాడికి పాల్పడటంతో తీర్ధ యాత్రికులకు హాని కలుగకుండా 930వ సంవత్సరంలో మక్కా యాత్రను రద్దు చేశారు. ఈ యుద్ధంలో దాదాపు 30 వేల మంది చనిపోయారు. ఇది ముస్లింల చరిత్రలోనే అతి పెద్ద దాడిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ దాడిలో మక్కాలోని పవిత్ర జమ్ జమ్ నీటి బావిని అపవిత్రం చేయడమే కాకుండా, పవిత్ర కాబా స్ధూపం పక్కనే ఉన్న నల్లరాయిని పగులగొట్టి ముక్కలను దోచుకెళ్లిపోయారు. ఈ దాడి తర్వాత హజ్ యాత్ర రద్దయింది. 20 ఏళ్ల తర్వాత నల్ల రాయి తిరిగి మక్కా చేరింది.

19వ శతాబ్దంలో కలరా విజృంభణ

19వ శతాబ్దంలో కలరా విజృంభణ

19వ శతాబ్దంలో పలుమార్లు కలరా వ్యాధి విజృంభించింది. 1837 నుంచి 1846 మధ్య హజ్ యాత్రతో పాటు వివిధ మతపరమైన యాత్రలు రద్దయ్యాయి. సౌదీలోని సినాయ్, హెజాజ్ ప్రాంతాల్లో హజ్ యాత్రికుల కోసం క్వారంటైన్ కేంద్రాలు సైతం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 1865లో సౌదీ అరేబియాలోని హెజాజ్ లో జరగాల్సిన అంతర్జాతీయ సదస్సును సైతం అప్పట్లో కాన్ స్టాంట్ నోపుల్ గా పిలిచే ప్రస్తుత ఇస్తాంబుల్ దేశానికి మార్చుకోవాల్సి వచ్చింది. 1830 నుంచి 1930 మధ్యలో మక్కాలోనే కనీసం 27 సార్లు కరోనా వ్యాప్తి చెందిన సందర్భాలు ఉన్నాయి.

 సౌదీలో గ్రాండ్ మసీదు ముట్టడి, 1979

సౌదీలో గ్రాండ్ మసీదు ముట్టడి, 1979

సౌదీకి చెందిన ఓ సాయుధ గ్రూపు మక్కాలోని గ్రాండ్ మసీదును ముట్టడించి రెండు వారాల పాటు తమ ఆధీనంలో ఉంచుకుంది

గ్రూపులోని 400 నుంచి 500 మంది సభ్యులు మసీదులో ప్రవేశించి ప్రార్ధనలు అడ్డుకున్నారు. జుహహ్మన్ ఇబ్న్ ముహమ్మద్ ఇబ్న్ సైఫ్ అల్ ఒటేబీ అనే సౌదీ సైనికుడు రాజకుటుంబం పోకడలకు వ్యతిరేకంగా అసలైన ఇస్లాంను నెలకొల్పే పేరుతో మరికొందరితో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.
సౌదీ భద్రతా బలగాలు ఫ్రెంచ్ కమాండోల ప్రత్యేక ఆపరేషన్ సాయంతో చివరికి మసీదును తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

 2014లో ఎబోలా వైరస్ వ్యాప్తి..

2014లో ఎబోలా వైరస్ వ్యాప్తి..

2000వ శతాబ్ధం తొలి దశకంలో ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి కలకలం రేపింది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల ద్వారా ఎబోలా విస్తరిస్తుందని నిర్ధారణ కావడంతో ప్రపంచం వణికిపోయింది. 2010 ప్రారంభంలో ఎబోలా వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న పలు పశ్చిమా అఫ్రికా దేశాలకు మిగతా దేశాలు వీసాల జారీ నిలిపేశాయి. 2014లో సౌదీ అరేబియా కూడా గినియా, లిబియా, సియర్రా లియోన్ వంటి దేశాల పౌరులకు ఉమ్రా, హజ్ వీసాలను నిరాకరించింది.

Recommended Video

Kodali Nani Slams Chandrababu Naidu And Yellow Media
 2016లో సిరియా అంత్యర్ధుద్దం...

2016లో సిరియా అంత్యర్ధుద్దం...

2016 ఏప్రిల్ 29న సిరియాలోని అలెప్పో నగరంలో ప్రభుత్వం తిరుగుబాటు దారులపై జరిపిన వైమానిక దాడుల కారణంగా శుక్రవారం మసీదుల్లో ప్రార్ధనలు రద్దయ్యాయి. ముందు జాగ్రత్తగా ప్రజలు ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవాలని పలు మత సంస్ధలు పిలుపునిచ్చాయి.

సిరియా చరిత్రలో ప్రపంచంలోనే అతి పురాతనమైన ఇస్లామిక్ సిటీ అలెప్పోలో ఇలా ప్రార్ధనలను ఇళ్లకే పరిమితం చేయడం అదే తొలిసారి.
ప్రజలను యుద్ధం నుంచి రక్షించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది.

English summary
if you see entire history of the world two things epidemics and war have shown most impact on muslim worship, in wake of ramadan month during coronavirus outbreak once again muslim brotherhood from all parts of the world remembered the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X