వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో: సింహం తప్పించుకుని రోడ్డుపైకొచ్చింది..వీడియో చూడండి

|
Google Oneindia TeluguNews

Recommended Video

సింహం తప్పించుకుని రోడ్డుపైకొచ్చింది..వీడియో చూడండి

కువైట్ : జూలో ఉన్న జంతువులు రోడ్లపై దర్శనమిస్తున్నాయి. ఏదో చిన్నా చితకా జంతువైతే ఏమోలే అనుకోవచ్చు. కానీ మనిషి కనపడితే ఒక్కసారి పంజావిసిరి పీసులు పీసులు చేసే సింహాలు, పులులు ఏకంగా రోడ్లపై ప్రత్యక్షమవుతున్నాయి. వీటిని చూసిన జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఇలాంటి ఘటనే కువైట్‌లో చోటుచేసుకుంది. రోడ్డుపైకి ఒక పెద్ద సింహం ప్రత్యక్షమవడంతో జనాలు కంగారు పడ్డారు. అయితే ఆ సింహం ఎవరికీ హానీ తలపెట్టలేదు. ఆ సింహాన్ని పట్టుకున్న అధికారులు జూకు తరలించారు.

ఇక కువైట్‌లో ఓ పెద్ద సింహం నడిరోడ్డుపై దర్శనం ఇచ్చింది. కబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సింహం జూ నుంచి తప్పించుకున్న సింహం కాదు... ఎవరో ఇంట్లో పెంచుకుంటున్న సింహం. ఒక్కసారిగా నివాస ప్రాంతంలోకి కనపడిపోయేసరికి అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. వెంటనే జూ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న వారు ఆ పెద్ద సింహానికి మత్తు మందు ఇచ్చి అదుపులోకి తీసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. దీనిపై కొందరు నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్ చేశారు.

Escaped lion enters residential area

ఆ సింహం ఎలా వచ్చిందని కొందరు నెటిజెన్లు ప్రశ్నిస్తే... మరికొందరు భయంకరమైన జీవి అంటూ కామెంట్ చేశారు. అయితే ఇది ఒక ఇంట్లో పెంపుడు జంతువని అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిందని ఒక అధికారి వెల్లడించారు. ఇప్పుడు ఈ సింహం ఓనర్ కోసం అధికారులు వెతుకుతున్నారు. ఒకవేళ ఓనర్ దొరికితే అతనికి మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కువైట్‌లో క్రూర జంతువులను ఇళ్లల్లో పెంచుకోవడం నేరంగా పరిగణిస్తారు. గతేడాది పాకిస్తాన్‌లో ఓ వ్యక్తి అతని కారులో ఓ సింహాన్ని తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ సింహం అనారోగ్యం బారిన పడటంతో దానిని డాక్టరు దగ్గరకు తీసుకెళ్లినట్లు వివరణ ఇచ్చాడు.

English summary
Authorities in Kuwait have shared a video and photos that show a huge lion wandering the city streets. The lion, believed to be an escaped pet, was safely captured before it could hurt anyone. According to the Kuwait News Agency, the Kuwait Livestock Authority said the big cat was spotted in a residential area of the Kabad District on Wednesday. It was captured by security personnel and handed over to a zoo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X