వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాన్ కొత్త ఆర్మీ చీఫ్ నియామకం: మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా..!

|
Google Oneindia TeluguNews

టెహ్రాన్: ఇరాన్ నూతన సైన్యాధ్యక్షుడిగా ఇస్మాయిల్ ఘానీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇరాన్ సైన్యంలో డిప్యూటీ బ్రిగేడియర్ జనరల్ గా పని చేస్తున్నారు. ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు అయతుల్లా అలీ ఖొమేనీ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇరానీ మీడియా వెల్లడించింది. ఇస్మాయిల్ ఖానీకి అత్యంత శక్తిమంతుడైన సైనికాధికారిగా పేరుందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. బాధ్యతలను స్వీకరించిన వెంటనే సమీక్షను నిర్వహించబోతున్నారని మీడియా స్పష్టం చేసింది.

ఇరాన్ వైపు వెళ్లొద్దు: ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు ఆదేశాలు: అమెరికా వైమానిక దాడులతో ఉద్రిక్తత!ఇరాన్ వైపు వెళ్లొద్దు: ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు ఆదేశాలు: అమెరికా వైమానిక దాడులతో ఉద్రిక్తత!

ఇరాక్ పై అమెరికా వైమానిక దళం నిర్వహించిన దాడుల్లో ఇరాన్ సైన్యాధ్యక్షుడు ఖాసిం సోలేమని దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. టెహ్రాన్ కు బయలుదేరి వెళ్లడానికి ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఖాసింపై అమెరికా వైమానిక దళాలు క్షిపణులతో దాడి చేశాయి. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటన తరువాత ఇరాన్ సహా మధ్య తూర్పు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Esmail Ghaani Named as New Quds Chief after Qassem Soleimani was killed in a US airstrike

కాగా- ఖాసిం మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని సైనిక ఉపాధ్యక్షుడు, బ్రిగేడియర్ జనరల్ ఇస్మాయిల్ ఘానీతో భర్తీ చేసింది ఇరాన్ ప్రభుత్వం. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. దీనితో- ఇస్మాయిల ఖానీ బాధ్యతలను స్వీకరించనున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆ వెంటనే- ఆయన దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయని మీడియా పేర్కొంది.

ఖాసిం సోలేమనిపై దాడి చేసి, హతమార్చిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. అమెరికా రాయబార కార్యాలయానికి ప్రాతినిథ్యవ వహిస్తోన్న స్విట్జర్లాండ్ హైకమిషనర్ కు సమన్లను జారీ చేసింది. ఇలాంటి వాతావరణంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది.

English summary
Iran has named Esmail Ghaani the new chief of Iran’s elite Quds force, after the previous commander Qassem Soleimani was killed in a US airstrike. Ghaani was formerly the deputy commander.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X