వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచు తుపాను: ఆరు వేల విమానాలు రద్దు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో మంచు తుఫాను భీభత్సం సృష్టించడంతో పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఈశాన్య అమెరికా ప్రాంతంలో ఎడతెరిపిలేకుండా 24 గంటలు కుండపోతగా మంచు కురుస్తుంది.

అమెరికాలో ప్రధాన రహదారుల్లో రెండు అడుగుల ఎత్తులో మంచు పేరుకుపోయింది. 8.5 కోట్ల మంది పైన మంచు తుపాను ప్రభావం పడుతోంది. అమెరికాలోని 20 రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ప్రజలు బయటకు రావాలంటే హడలిపోతున్నారు.

వాహనాలు బయటకు తీస్తే ఎక్కడ మంచులో ఇరుక్కుపోతామో అంటూ భయపడుతున్నారు. ఇప్పటికే అప్రమత్తం అయిన అధికారులు, సిబ్బంది రోడ్ల మీద పేరుకుపోయిన మంచును తొలగించే పనిలో నిమగ్నం అయ్యారు.

 Est cost blizzard already a travel nightmare in America

మంచు తుపాను కారణంగా అమెరికాలో ఆరు వేల విమానాల సర్వీసులు రద్దు అయ్యాయని అధికారులు తెలిపారు. అమెరికాలోని వాషింగ్టన్, న్యూయార్క్, కరోలినా, అర్కాన్సాస్, డల్లాస్ తదితర ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతున్నది.

మంచు తుపాను కారణంగా అమెరికాలోని కోటి ఇండ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాహన సంచారం అస్తవ్యస్థం అయ్యింది. త్వరలో పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు అంటున్నారు. ప్రజలు ఇండ్లకే పరిమితం అయ్యారు.

English summary
where American said it would preemptively ground its entire schedule Friday ahead of icy and wintry weather there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X