వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం, బోయింగ్ 737లో సిబ్బంది సహా 157 మంది

|
Google Oneindia TeluguNews

ఆడిస్ అబాబా: ఇథియోపియా ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 149 మంది ప్రయాణీకులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం 157 మంది ఉన్నారు. ఆడిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

తెలివి తేల్లారింది! అక్షరదోషం: విమానాన్నే పేయింట్ షాప్‌కు పంపించారుతెలివి తేల్లారింది! అక్షరదోషం: విమానాన్నే పేయింట్ షాప్‌కు పంపించారు

ఈ సంఘటన ఆదివారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) గం.8.44 నిం.లకు చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇథియోపియా ప్రధానమంత్రి కార్యాలయం తన అధికారిక ట్విట్టర్‌లోను స్పందించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.

Ethiopian Airlines with 157 on board crashes en route to Kenya

ఇథియోపియా ఎయిర్ లైన్స్ బోయింగ్ 737 కూలిన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణీకుల కుటుంబాలకు ప్రధాని తరఫున, ప్రభుత్వం తరఫున, ఇథియోపియా ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ విమానం నైరోబీ వెళ్తుండగా దుర్ఘటన జరిగినట్లుగా పేర్కొన్నారు.

English summary
An Ethiopian Airlines flight to Nairobi crashed early on Sunday with 149 passengers and eight crew members aboard, a spokesman for the airline told Reuters. “It is confirmed it happened 8.44 (am),” said the spokesman who did not give his name.
Read in English: Ethiopian Airlines crashes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X