వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నజైలు గదిలో మహిళ కష్టాలు: వీడియో బహిర్గతం

By Srinivas
|
Google Oneindia TeluguNews

కువైట్: కువైట్‌లోని ఓ జైలులో ఇథియోపియాకు చెందిన ఓ మహిళ నరకం అనుభవిస్తోంది. ఓ చిన్న జైలు గదిలో పదిమంది మహిళలతో పాటు ఆమె ఉంటోంది. జైలులో నరకం అనుభవిస్తోంది. అయితే, ఇంతకు తాను చేసిన నేరం ఏమిటో ఆమెకే తెలియదు. ఏ జైలులో ఉన్నానో కూడా ఆమెకు తెలియదు.

ఆమె తన దేశానికి ఎప్పుడు తిరిగి వెళ్తుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఆమె తన బాధను అంతటినీ సెల్‌ఫోన్‌లో వీడియోలో చిత్రీకరించింది. దానిని ఫేస్‌బుక్ ద్వారా అందరికీ తెలిసేలా అప్ లోడ్ చేసింది.

Ethiopian women imprisoned in Kuwait call for rescue

దీంతో, కువైట్ ప్రభుత్వంతో మాట్లాడి ఆ మహిళను ఇథియోపియాకు రప్పించాలని ఆ దేశ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కువైట్‌లోని ఇథియోపియా రాయబార కార్యాలయం దీనిపై విచారణ జరిపింది. ఆమె అల్ జహ్రా జైలులో ఉన్నట్లు గుర్తించారు.

వీసా జరిమానలు, అప్పులు చెల్లించాల్సి ఉండటం, స్పాన్సర్‌తో వివాదం కారణంగా ఆమెను జైలులో ఉంచినట్లు తేలింది. ఆమెను విడిపించేందుకు ఇథియోపియా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

English summary
Ethiopian women imprisoned in Kuwait call for rescue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X