వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ కు షాక్: $2.7 బిలియన్ యూరోల ఫైన్ విధించిన ఈయూ

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ కు యూరోపియన్ యూనియన్ భారీ జరిమానాను విధించింది. గూగుల్ అందిస్తోన్న షాపింగ్ సర్వీస్ నిబంధనలకు విరుద్దంగా ఉందని ఆరోపిస్తూ రికార్డ్ స్థాయిలో జరిమానాను విధించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బ్రస్సెల్స్: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ కు యూరోపియన్ యూనియన్ భారీ జరిమానాను విధించింది. గూగుల్ అందిస్తోన్న షాపింగ్ సర్వీస్ నిబంధనలకు విరుద్దంగా ఉందని ఆరోపిస్తూ రికార్డ్ స్థాయిలో జరిమానాను విధించింది.

పలు సంస్థలకు అక్రమంగా లబ్దిని చేకూర్చుతోందన్న ఆరోపణలపై ఈయూ సుదీర్ఘ విచారణ నిర్వహించిన అనంతరం మంగళవారం నాడు ఈ ఆదేశాలను జారీ చేసింది.

google

గూగుల్ అందిస్తోన్న ఆ సర్వీసు నిబంధనలకు విరుద్దంగా ఉందని తేల్చిన ఈయూ ఆ సంస్థకు ఏకంగా 2.4 బిలియన్ యూరోల (2.72 బిలియన్ డాలర్లు) జరిమానాను విధించింది. గూగుల్ తమ సెర్చింజన్ లో చూపించిన ఆన్ లైన్ షాపింగ్ సర్వీస్ సంస్థల పేర్లు ఇతర సంస్థలకు నష్టం చేకూర్చేవిధంగా ఉన్నాయని తేల్చింది.

గూగుల్ సెర్చ్ లో తన షాపింగ్ సర్వీస్ లనే ప్రమోట్ చేసి, ప్రత్యర్థి కంపెనీలను డీమోట్ చేసిందన్న ఆరోపణలు గూగుల్ పై ఉన్నాయి.దీనిపై విచారణ చేసిన ఈయూ యాంటీట్రస్ట్ విభాగం గూగుల్ కు 242 కోట్ల యూరోలు( రూ.17,590కోట్లు) జరిమానాను విధించింది. 90 రోజుల్లోగా సెర్చ్ లో తన షాపింగ్ సర్వీసులకు ఫేవర్ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది.

లేకపోతే ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ కు వచ్చే టర్నోవర్ లో 5 శాతం పెనాల్టీని వేస్తామని కూడ హెచ్చరించింది. ఏడేళ్ళుగా దీనిపై విచారణచేస్తున్న కమిషన్ ఈయూ యాంటీట్రస్ట్ నిబంధనల ప్రకారం గూగుల్ చేసింది చట్టవిరుద్దమని తేల్చింది.

అలాగే తన అండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ప్రత్యర్థులను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఏడేళ్ళుగా గూగుల్ పై పదుల సంఖ్యలో కంపెనీలు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నాయి. కాగా ఈయూలో యాంటీట్రస్ట్ కేసులో అతిపెద్ద జరిమానాను ఎదుర్కొన్న కంపెనీగా గూగుల్ నిలిచింది. 2009 లో అమెరికా చిప్ మేకర్ ఇంటెల్ కు 1.06 బిలియన్ యూరోల జరిమానా విధించింది.

English summary
EU antitrust regulators hit Alphabet (GOOGL.O) unit Google with a record 2.42-billion-euro ($2.7 billion) fine on Tuesday, taking a tough line in the first of three investigations into the company's dominance in searches and smartphones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X