వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈయూ నుంచి బ్రిటన్ ఔట్: విడిపోదామన్న మెజార్టీ ప్రజలు, ట్రేడింగ్ నిలిపివేసిన జపాన్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

లండన్: అంతా అనుకున్నట్టే జరిగింది. ఐరోపా యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలగాలనే బ్రిటన్ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈయూలో బ్రిటన్ కొనసాగనుందా? వైదొలగాలా? అనే అంశంపై నిర్వహించిన రిఫరెండం ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి.

51.9 శాతం మంది ప్రజలు ఈయూ నుంచి వైదొలగాలని కోరుకుంటే 48.1 శాతం మంది ప్రజలు ఈయూలోనే కొనసాగాలని కోరుకున్నారు. యూనియన్ లోనే బ్రిటన్ ఉండాలని 1,61,41,241 మంది, వీడి పోవాలని 1,74,10,742 మంది కోరుకున్నారు.

దీంతో 12,69,501 ఓట్ల తేడాతో బ్రెగ్జిట్ విజయం సాధించింది. బ్రెగ్జిట్ ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠను కలిగిస్తూ గంట గంటకు తారుమారయ్యాయి. గురువారం బ్రెగ్జిట్‌పై బ్రిటన్ నిర్వహించిన రెఫరెండంలో ఈయూ నుంచి వైదొలగాలనే ప్రజలు ఓటేశారు.

'బ్రెగ్జిట్' ఓటింగ్: ఎందుకు, భారత మార్కెట్లపై ప్రభావం?'బ్రెగ్జిట్' ఓటింగ్: ఎందుకు, భారత మార్కెట్లపై ప్రభావం?

EU referendum results live: Brexit wins as Britain votes to leave European Union

బ్రెగ్జిట్‌లో కొనసాగాలని కోటి 49 లక్షల మంది ప్రజలు ఓటేయగా, వైదలగాలని కోటి 59 లక్షల మంది ఓటేశారు. బ్రెగ్జిట్‌లో ఫలితాల వెల్లడిలో రెండు వర్గాల మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ ఈయూ నుంచి వైదొలగాలనే బ్రిటన్ ప్రజలు నిర్ణయించారు. దీంతో ఈయూ నుంచి వైదొలగే మొట్టమొదటి దేశంగా బ్రిటన్ నిలిచింది.

యూరోపియన్ యూనియన్ కూటమిలో మొత్తం 28 దేశాలు ఉన్న సంగతి తెలిసిందే. వందల ఏళ్ల పాటు ప్రపంచంలో ఎన్నో దేశాలను తన గుప్పిట్లో ఉంచుకుని పాలించిన బ్రిటన్, ఇప్పుడు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడానికి ప్రధానం కారణం స్వేచ్ఛా వాణిజ్యం నుంచి యూరప్‌లో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న దేశాల భారం తమపై పడకుండా ఉండేందుకే.

ఐరోపా యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల కూటమిలో ఉండటం వల్ల తమకు నష్టమే అధికమని భావిస్తున్న బ్రిటన్ వాసులు, కూటమి నుంచి వైదొలగాలని తీర్పునిచ్చారు. కాగా ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలని గట్టి ప్రచారం చేసి ప్రజల్లో సెంటిమెంటును నింపిన నైజిల్ ఫరాగే తన విజయాన్ని ప్రకటించుకున్నారు.

బ్రిటన్ వాసులు 'బ్రెగ్జిట్'కు ఓటు వేయడం చరిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. "దిస్ ఈజ్ అవర్ ఇండిపెండెన్స్ డే. యూనియన్ నుంచి బయటకు రావాలని అత్యధికులు భావిస్తుండటం భవిష్యత్తుకు, బ్రిటన్ చిన్నారులకు మేలు కలిగించే నిర్ణయం. ఇక ఈయూ నుంచి బయటకు రావాలని పార్లమెంటులో ఒత్తిడిని పెంచుతాం. ఓటమిని అంగీకరించి ప్రధాని డేవిడ్ కామెరాన్ రాజీనామా చేయాలి" అని ఆయన అన్నారు.

ఇది స్వాతంత్రం కోరుకుంటున్న నిజమైన బ్రిటన్ వాసుల విజయమని, వలస వాదుల్లో అత్యధికులు అనుకూలంగా ఓట్లను వేసినందునే గెలుపు మార్జిన్ తక్కువగా ఉందని అన్నారు. జూన్ 23 బ్రిటన్ చరిత్రలో సువర్ణాధ్యాయమని అభివర్ణించారు. కాగా బ్రెగ్జిట్ ఫలితాల ప్రభావం యావత్ ప్రపంచ స్టాక్ మార్కెట్లపై పడింది. ముఖ్యంగా బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ ఎన్నడూ లేని విధంగా 11 శాతం పతనమైంది.

ఫలితాల వెల్లడి ఇలా సాగింది:
తొలి దశలో ఫలితాలను చూస్తుంటే తొలుత బ్రెగ్జిట్ నుంచి తప్పుకోవాలనుకునే వారే సంఖ్యే ఎక్కువగా కనిపించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే యూరోపియన్ యూనియన్‌లో కొనసాగాలనుకునే వారి సంఖ్య పెరిగింది. చివరకు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాల్సిందేనని అత్యధిక ప్రజలు కోరుకుంటున్నారు.

భారత కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి తర్వాత ఓట్ల లెక్కింపు మొదలైంది. తొలి దశలో ఫలితాలు విడుదలైన దానిని బట్టి చూస్తే యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలగాలనుకునే వారిదే పైచేయిగా కనిపించింది. మొత్తం 383 కౌంటింగ్ ఏరియాల్లో ఇంతవరకూ 171 చోట్ల ఓట్ల లెక్కింపు పూర్తికాగా, 51.3 శాతం మంది ప్రజలు బ్రెగ్జిట్‌కు అనుకూలంగాను, 48.7 శాతం మంది వ్యతిరేకంగాను ఓట్లు వేసినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

పూర్తి ఫలితాలు 11:30 గంటలకు వచ్చాయి. తొలి ఫలితం సండర్లాండ్ నుంచి వెలువడగా, ఇక్కడ 82,394 మంది విడిపోవాలని, 51,930 మంది కలిసి కొనసాగాలని ఓట్లు వేశారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలని 52 శాతం మంది ప్రజలు కోరుకున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో బ్రిటన్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి.

31 ఏళ్ల కనిష్ఠానికి బ్రిటన్ పౌండ్ మారకం విలువ
బ్రిటన్ పౌండ్ 31 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే డాలర్ తో పౌండ్ విలువ ఏకంగా 6 శాతం నష్టపోయి 1.3879 డాలర్లకు చేరింది. విదేశీ మారక ద్రవ్య మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఉందని వరల్డ్ ఫస్ట్ ఎకానమిస్ట్ జెర్మీ కుక్ వ్యాఖ్యానించారు. 1985 తరువాత పౌండ్ ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి.

భారీగా పతనమైన జపాన్ స్టాక్ మార్కెట్లు
బ్రెగ్జిట్‌ ఫలితాల నేపథ్యంలో ప్రపంచ స్టాక్‌మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. జపాన్ మార్కెట్ ను చావుదెబ్బతీశాయి. జపాన్ నిక్కీ 225 సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 1,174 పాయింట్లు పడిపోయి 7.8 శాతం నష్టంతో 15,063 పాయింట్లకు చేరింది.

ఇటీవలి కాలంలో జపాన్ స్టాక్ మార్కెట్ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. బ్రెగ్జిట్‌ ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడటంతో జపాన్ తన ట్రేడింగ్‌ను నిలిపివేసింది.

ఉదయం 9:45 (భారత కాలమానం ప్రకారం) గంటల సమయంలో కొరియన్ సూచిక స్ట్రెయిట్స్ టైమ్స్ 2.67 శాతం నష్టపోయి 2,712 పాయింట్ల వద్ద, తైవాన్ సూచిక 2.81 శాతం పతనంతో 8,439 పాయింట్ల వద్ద, ఇండొనేషియా మార్కెట్ సూచిక జకార్తా కాంపోజిట్ 2.02 శాతం నష్టంతో 4,777 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి.

నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లపై కూడా బ్రెగ్జిట్ తీవ్ర ప్రభావం చూపింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రాంభమైనప్పటి నుంచి భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్రెగ్జిట్ ఫలితం భారత స్టాక్ మార్కెట్లకు 'బ్లాక్ ఫ్రైడే'ను మిగిల్చేలా ఉంది. ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తడంతో ప్రీమార్కెట్ సెషన్లో 400 పాయింట్లు పడిపోయిన బెంచ్ మార్క్ సూచిక సెన్సెక్స్, ఆపై సెషన్ ఆరంభంలోనే 750 పాయింట్లకు పైగా పడిపోయింది.

ఆపై 9:35 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే, బీఎస్ఈ సెన్సెక్స్ 692 పాయింట్ల నష్టంతో 26,309 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 220 పాయింట్ల నష్టంతో 8,049 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లో సన్ ఫార్మా మినహా మిగతా అన్ని కంపెనీలూ నష్టాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా టాటా గ్రూప్ కంపెనీల ఈక్విటీ విలువ దిగజారింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 68
డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ. 68.85గా ఉంది. ఇది నాలుగు నెలల కనిష్ఠ స్థాయి. ప్రస్తుతం రూపాయి విలువ 68.85 వద్ద ఉండగా, ఇది మరింతగా పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బ్రిగ్జిట్ ఫలితాలతో ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా రెండేళ్ల గరిష్ట స్థాయికి బంగారం ధరలు పెరిగాయి.

English summary
The Brexit referendum, which will decide whether the U.K. remains in the 28-member trade block, was set to begin Thursday, with results due early Friday local time. Broadly, opinion polls showed the remain and leave camps were neck-and-neck, making the result too close to call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X