• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

germany floods: నిద్రలోనే జలసమాధి -యూరప్‌ జలవిలయంలో150 మంది మృతి, 1500 మంది గల్లంతు

|

అదో వికలాంగుల వసతి గృహం.. నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో అంతా భయంభయంగానే నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా ప్రళయం వారిని ముంచేసింది. ఎటూ పరుగెత్తలేని స్థితిలో మొత్తం 12మంది జల సమాధి అయ్యారు. ఇలాంటి ఘటనలే పదుల సంఖ్యలో జరిగాయి. వరద విలయానికి వేలాది మంది గల్లంతుకాగా, వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

  Death Toll Climbs In Western Germany Flooding

  యుగాంతానికి సంబంధించి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల తరహా దృశ్యాలు ఇప్పుడు నిజంగానే పశ్చిమ యూరప్ దేశాల్లో కనిపిస్తున్నాయి. జర్మనీ సహా బెల్జియం, నెదర్లాండ్ దేశాల్లో కనీవినీ ఎరుగని రీతిలో జల ప్రళయం కొనసాగుతున్నది. జర్మనీలో అసాదారణ బీభత్సం సృష్టించిన వరదలు, బెల్జియంలోనూ భయానకంగా సాగుతున్నాయి.

  షాకింగ్: స్మశానాన్ని అమ్మేసిన కేసీఆర్ సర్కార్ -వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశం -ఖానామెట్ భూమిలో కిరికిరిషాకింగ్: స్మశానాన్ని అమ్మేసిన కేసీఆర్ సర్కార్ -వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశం -ఖానామెట్ భూమిలో కిరికిరి

  జనం జల సమాది, గల్లంతు.

  జనం జల సమాది, గల్లంతు.

  జర్మనీలో బెల్జియం సరిహద్దును ఆనుకుని ఉండే రాయిన్‌లాండ్-పలాటినెట్ రాష్ట్రంలో గల సిన్‌జిన్ పట్టణంలో వికలాంగుల కోసం నిర్వహించే ఒక కేర్ హోమ్‌లో అందరూ నిద్రపోతున్నప్పుడు వరద నీరు ముంచెత్తడంతో లోపలున్న 35 మందిలో 12 మంది జల సమాధి అయ్యారు. పశ్చిమ యూరప్ వరదల్లో ఎక్కువగా జర్మనీనే ప్రభావితమైంది. ఆ దేశంలో ఇప్పటికే మరణాల సంఖ్య 120 దాటగా, మరో 1300 మంది గల్లంతయ్యారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆకస్మిక వరదలు రావడంతో ప్రాణ, ఆస్తి నష్టం అధికంగా ఉంది.

  ఆశ్చర్యం.. అద్భుతం: గాలిలో గల్లంతైన విమానం -చివరికి నేలపై ఇలా -అందరూ సేఫ్, హీరో పైలట్స్ఆశ్చర్యం.. అద్భుతం: గాలిలో గల్లంతైన విమానం -చివరికి నేలపై ఇలా -అందరూ సేఫ్, హీరో పైలట్స్

  నిలిచిన రవాణా, మొబైల్ సేవలు

  నిలిచిన రవాణా, మొబైల్ సేవలు

  దశాబ్దాల తర్వాత జర్మనీలో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లాయి. వరదనీరు పోటెత్తి ఇళ్లను ముంచేసింది. బెల్జియం సరిహద్దును ఆనుకుని ఉండే జర్మనీ నైరుతి రాష్ట్రాలైన రాయిన్‌లాండ్-పలాటినెట్, నార్త్ రాయిన్-వెస్ట్‌ఫాలియాలో వరద నష్టం తీవ్రంగా ఉంది. 700 మంది జనాభా ఉండే షోల్డ్ గ్రామం పూర్తిగా జలమయం అయ్యింది. కోలోన్ పట్టణం దగ్గర ఒక కాలనీని వరదలు ముంచెత్తడంతో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు ధ్వంసం కావడంతో రవాణాకు ఆటంకం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అటు

  ప్రమాదకరంగా డ్యామ్‌ల పరిస్థితి

  ప్రమాదకరంగా డ్యామ్‌ల పరిస్థితి

  బెల్జియంలోనూ వరద విలయం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 200 మంది ఆచూకీలేకుండా పోయారు. జర్మనీ-బెల్జియం సరిహద్దుల్లోని ఒక పెద్ద ఆనకట్టలో నీటి నిలువలు ప్రమాదకర స్థాయికి చేరాయి. ఏక్షణమైనా డ్యామ్ తెగిపోవచ్చనే అనుమానంతో అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. నెదర్లాండ్స్, లక్సంబర్గ్, స్విట్జర్లాండ్‌లో కూడా వరదల వల్ల వేలమంది ప్రభావితం అయ్యారు. వాతావరణంలో మార్పుల వల్లే యూరప్ దేశాల్లో కనీవినీ ఎరుగని వరద విలయం తలెత్తిందని నిపుణులు భావిస్తున్నారు.

  English summary
  At least 150 people have died in devastating floods across parts of western Germany and Belgium, officials say, as rescue operations continue. Most of these deaths happened in Germany, where hundreds of people are still missing. In Belgium, at least 27 people have died due to the flooding. The country is due to hold a national day of mourning on Tuesday. By Saturday, waters were receding across much of the affected regions, but officials feared that more bodies might be found in cars and trucks that were swept away.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X