వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒర్లాండో కాల్పుల ఘటన ట్రంప్‌కు కలిసొస్తుందా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ఒర్లాండో: ఒర్లాండోలో జరిగిన గే నైట్‌క్లబ్‌ కాల్పుల ఘటన రిపబ్లికన్ల తరుపున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్ట్ ట్రంఫ్‌కు కలిసొస్తుందా? అంటే అవుననే అంటున్నారు అమెరికాలోని ఇజ్రాయిల్‌‌ దేశ మాజీ రాయబారి మైఖెల్ ఓరన్. అమెరికా అధ్యక్ష ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ముస్లింలపై డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

అమెరికాలోకి ముస్లిలంను రానివ్వొద్దనే ఆయన వాదనకు పలువురు అమెరికన్లు సైతం మద్దతు తెలిపారు. ముస్లింలను అమెరికాలోకి రానివ్వడం వల్లే ఉగ్రవాదం ఆ దేశంలో పెచ్చిరిల్లి పోయిందని పలు మార్లు బహిరంగ సభల్లో సైతం ప్రస్తావించారు. తాజా ఘటనపై ఇస్లామిక్ తీవ్రవాదంపై ట్రంప్ తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.

donald-trump

నైట్ క్లబ్ ఘటనతో ముస్లింలపై తన వైఖరి సరైనదేనని మరోసారు రుజువైందని డొనాల్ట్ ట్రంఫ్ వ్యాఖ్యానించారు. ఓర్లాండోలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనను అమెరికా చరిత్రలోనే పెద్ద దాడిగా ఆయన అభివర్ణించారు. ఒర్లాండో కాల్పుల ఘ‌ట‌న త‌ర్వాత ఆ ఘ‌ట‌న‌ను ఖండిస్తూ అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్ తన వరుస ట్వీట్టలో ఇస్లామిక్ ఉగ్రవాదంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఉగ్రవాదులపై, ముస్లింలపై తన దృక్పథం కరెక్టేనని ఈ ఘటన నిరూపించిందని, అమెరికన్లు మరింత తెలివిగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందంటూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. త‌న ఆలోచ‌న ప‌ట్ల ప్ర‌జ‌ల కృతజ్ఞతల త‌న‌కు అవ‌స‌రం లేద‌ని, మ‌రింత దృఢంగా, మ‌రింత నిఘాతో ముందుకు వెళ్లాల‌ని సూచించారు.

నైట్‌క్లబ్‌లో జరిపిన కాల్పుల సమయంలో ఒమర్‌ అల్లాహు అక్బర్‌ అంటూ అరిచాడని ట్వీట్ చేశారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజాన్ని కూకటివేళ్లతో పెకిలించి తీరాల్సిందేనని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇస్లామిక్ ఉగ్ర‌వాదం ప‌ట్ల స్మార్ట్‌గా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్వవహరించకపోతే అమెరికా చిన్నాభిన్న‌మ‌వుతుంద‌ని ట్రంప్ అన్నారు.

అమెరికాను పాలిస్తున్న నేతలు బలహీనులని, అందువల్లే దేశ ప్రజలపై దాడులకు ముష్కరులు తెగబడుతున్నారని ఆయన విమర్శించారు. పాలకులు కఠినంగా లేకుంటే, ఓర్లాండోలో జరిగిన ఘటనలు మరిన్ని చూడాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఓర్లాండో నైట్ క్లబ్ ఘటనపై యావత్ ప్రపంచం ముక్త కంఠంతో ఖండించింది.

ఈ క్రమంలో ఈ న‌వంబ‌ర్‌లో అమెరికా దేశాధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నికల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో ట్రంప్ పోటీప‌డ‌ుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపుతుందని పలువులు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉగ్రవాదంపై అమెరికా మెతకవైఖరి అవలంభిస్తోందని పలువురు రిపబ్లికన్ పార్టీకి చెందిన నేతలు సైతం అంటున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తేతే ఆ పార్టీకి కలిసొస్తుందని పలువురు రిపబ్లికన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజా ఘటనతో అమెరికన్లు ట్రంప్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ మీడియా సంస్ధలు పేర్కొన్నాయి.

English summary
Former Israeli envoy to US Michael Oren says jihadist motive will strengthen Trump's anti-Islam campaign message.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X