వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొకైన్ కొనేందుకు ఫిఫా వరల్డ్ కప్ గోల్డ్ మెడల్‌ను అమ్మిన బ్రెజిల్ సాకర్ ప్లేయర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

రియో డి జనీరో: మత్తు పదార్దాలకు బానిసై యవత పెడదారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో యువతీ యవకులతో పాటు, పేరున్న కొందరు ప్రముఖులు ఈ డ్రగ్స్ వాడటం వల్ల అప్రతిష్ఠ పాలవుతున్నారు. తాజాగా బ్రెజిల్ మాజీ పుట్ బాల్ ఆటగాడు పావ్లో సీజర్ కొకైన్ కొనేందుకు వరల్డ్ కప్ బంగారు పతకాన్ని అమ్మేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ విషయాన్ని స్వయంగా సీజర్ ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ వెల్లడించాడు. ఈ విషయం ఇంతవరకు ఎవరికీ చెప్పలేదని అన్నాడు. 1970లో బ్రెజిల్ ఫిఫా వరల్డ్ కప్ నెగ్గింది. ఆ జట్టులో సీజర్ కూడా ఉన్నాడు. ఫ్రాన్స్ క్లబ్ పోటీల్లో మార్సెలీ జట్టు తరుపున ఆడే కాలంలో డ్రగ్స్ వాడకం నేర్చుకున్నానని చెప్పాడు.

Ex-Brazilian Star Cesar Sold World Cup Gold Medal to Buy Cocaine

బంగారు పతకం అమ్మడం గురించి చెబుతూ, ఆనాడు కొకైన్ కంటే ఏదీ ముఖ్యం అనిపించలేదని, వరల్డ్ కప్‌లో దక్కిన తాను సాధించిన బంగారు పతకం కూడా డ్రగ్స్ కంటే తక్కువగానే భావించానని పేర్కొన్నాడు. దాదాపు పదిహేడేళ్ల పాటు డ్రగ్స్, ఆల్కహాల్‌కు బానిస అవడం వల్ల రియో డి జనీరోలో మూడు అపార్ట్ మెంట్స్‌ను కోల్పోయానని చెప్పాడు.

65 ఏళ్ల పావ్లో సీజర్ బ్రెజిల్ తరుపున పేరున్న క్లబ్స్ అయిన బోటఫోగోతో, ఫ్లెమింగో, ఫ్లుమినెన్స్, క్లబ్లో, వాస్కో డా గామా, కొరింథీయులు తరుపున ఆడారు. ఇది ఇలా ఉంటే 1970లో ఇటలీతో జరిగిన ఫైనల్ వరల్డ్ కప్‌లో సీజర్ సబ్ స్టిట్యూట్‌గా బెంచికే పరిమితమయ్యారు.

English summary
Paulo Cesar, a member of Brazil's famed 1970 football World Cup winning team, has admitted he sold the gold medal to buy cocaine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X