వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్సాస్ బ్యూటీ క్వీన్ హత్య మిస్టరీ వీడింది: 57ఏళ్ల తర్వాత!, అతనే దోషి..

|
Google Oneindia TeluguNews

టెక్సాస్: చర్చికి వచ్చిన ఓ మహిళపై లైంగిక దాడి చేసి హత్యకు పాల్పడిన ఓ ఫాదర్‌కు 57ఏళ్ల తర్వాత ఎట్టకేలకు శిక్ష పడింది. అతనికి జీవిత ఖైదు విధుస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. 1960 ఏప్రిల్‌లో అమెరికాలోని టెక్సాస్‌లో ఇరెనె గార్జా(25) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆమె చివరిసారిగా మెక్‌అలెన్‌లోని చర్చికి వెళ్లడం చూసినట్లు కొంతమంది స్థానికులు అప్పట్లో సాక్ష్యం చెప్పారు. స్థానిక చర్చి ఫాదర్ జాన్‌ ఫీట్‌ను ఆమె కలిసినట్లు కూడా తెలిపారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో తొలుత పోలీసులు ఫాదర్‌ జాన్‌ను హత్య కేసులో అనుమానితుడిగా చేర్చారు. అప్పటికి అతని వయసు 27ఏళ్లు, ఇప్పుడు 85ఏళ్లు. టీచర్ గా, సౌత్ టెక్సాస్ స్వీట్ హార్ట్‌గా పేరున్న గార్జా మరణం అప్పట్లో పెను సంచలనమే అయింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

Ex-priest found guilty of historic 1960 Texas murder as church cover-up allegations persist

అప్పటినుంచి ఇప్పటివరకు ఆ కేసు విచారణ కొనసాగుతూనే వచ్చింది. ఎట్టకేలకు గార్జాను తానే హత్య చేసినట్లు ఫాదర్ జాన్ అంగీకరించడంతో ఈ కేసుకు తెరపడింది.

చర్చికి వచ్చిన గార్జాపై లైంగిక దాడికి పాల్పడ్డానని, విషయం బయటపడుతుందని ఆమె ముఖాన్ని ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చానని జాన్ అంగీకరించాడు.

జాన్ నేరం అంగీకరించడంతో శుక్రవారం టెక్సాస్ కోర్టు జాన్ ను దోషిగా తేలుస్తూ జీవిత ఖైదు విధిస్తున్నట్లు ప్రకటించింది.

English summary
For more than five decades, the black-and-white image of Irene Garza has haunted the town of McAllen, Texas, her story painfully recounted again and again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X