• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'ఇప్పటి వరకు అలాలేదు, హెచ్1బీపై ఆందోళన వద్దు', శ్రీనివాస్ హత్యపై ఎఫ్‌బీ'ఐ'

|

వాషింగ్టన్: హెచ్‌ 1బీ వీసాలపై భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికాలోని దేశీఓపీటీ సంస్థ వ్యవస్థాపకులు నరేంద్ర చెప్పారు.

'భారత్‌పై పాజిటివ్‌గా అమెరికా యంత్రాంగం', కన్సాస్ కాల్పులపై...'భారత్‌పై పాజిటివ్‌గా అమెరికా యంత్రాంగం', కన్సాస్ కాల్పులపై...

అమెరికాలో ప్రవేశపెట్టిన బిల్లు కేవలం ప్రతిపాదనలు మాత్రమేనని, ఇప్పటి వరకు నిబంధనల్లో ఎలాంటి స్పష్టమైన మార్పు లేదన్నారు. అయితే హెచ్‌1బీ, ఎల్‌1 వీసా బిల్లు పెద్ద పెద్ద కంపెనీలపై ప్రభావం చూపుతాయే తప్ప ఉద్యోగులు, విద్యార్థులపై తక్కువే అన్నారు. హెచ్‌1బీ వీసాతో పాటు ప్రీమియమ్‌ ప్రాసెసింగ్‌ తాత్కాలిక రద్దు, ప్రత్యామ్నాయ మార్గాలను ఆయన వివరించారు.

కాన్సాస్ కాల్పులపై అలా అనవద్దు

కాన్సాస్ కాల్పుల పైన గవర్నర్ శామ్ బ్రౌన్ బ్యాక్ స్పందించారు. ఒక వ్యక్తి చేసిన దుశ్చర్య ఆధారంగా అమెరికాను అంచనా వేయడం సరైనది కాదని వ్యాఖ్యానించారు.

విచారణ

విచారణ

శ్రీనివాస్ కూచిభొట్ల మృతికి కారణమైన కాన్సస్ కాల్పుల ఘటనను వ్యక్తిగత నేరంగా భవించి విచారిస్తామని అమెరికా ఉన్నతాధికారులు చెప్పినట్టు భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను అమెరికన్ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని తెలిపారు.

సర్వత్రా వ్యతిరేకత

సర్వత్రా వ్యతిరేకత

వాణిజ్యశాఖ కార్యదర్శి రీటాతో కలిసి అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారులతో జైశంకర్ చర్చలు జరిపారు. కాన్సాస్ ఘటనకు సంబంధించిన బాధితులకు న్యాయం చేసేందుకు అమెరికన్ న్యాయ వ్యవస్థ కృషి చేస్తోంది. ఎఫ్‌బీఐ దీన్ని విద్వేషనేరంగా పరిగణించి విచారణ జరుపుతోంది. శ్వేతసౌధవర్గాలు, అధ్యక్షుడు ట్రంప్, కాంగ్రెస్ స్పీకర్, ప్రజలు సైతం ఈ ఘటనను వ్యతిరేకిస్తున్నారు.

సానుభూతి

సానుభూతి

కాన్సాస్ కాల్పుల పైన ప్రతి ఒక్కరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారని జైశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు వాషింగ్టన్ డీసీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే భారతీయ అమెరికన్లు వాషింగ్టన్‌లోని డ్యూపాంట్ సర్కిల్‌లో శ్రీనివాస్ కూచిభొట్ల స్మారకార్థం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ప్రతి బాధాకర సంఘటన మరింత దగ్గర చేస్తోంది

ప్రతి బాధాకర సంఘటన మరింత దగ్గర చేస్తోంది

ప్రతి బాధాకర సంఘటన మనల్ని అమెరికాకు మరింత దగ్గర చేస్తోందని, అమెరికన్లుగా ఎన్ని కష్టాలు వచ్చినా దీటుగా ఎదుర్కొంటూ నిలబడతామని, విద్వేషం, హింస కారణంగా మరో అమెరికన్ ప్రాణాలను కోల్పోకూడదని, నీది ఏ జాతి, ఏ మతం, ఏ రంగు అనేది ము ఖ్యం కాదని, మనందరి రక్తం ఒక్కటే అని భారతీయ అమెరికన్ రిపబ్లికన్ నాయకుడు పునీత్ అహ్లువాలియా పేర్కొన్నారు.

శ్రీనివాస్ హత్యపై ఎఫ్‌బీఐ విచారణ

శ్రీనివాస్ హత్యపై ఎఫ్‌బీఐ విచారణ

అమెరికాలో జాత్యహంకార హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్ల కేసులో ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభించింది. అటార్నీ కార్యాలయం, న్యాయశాఖ, మానవ హక్కుల విభా గం నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ జాత్యహంకార హత్యపై విచారణ ప్రారంభిస్తున్నాం అని ఎఫ్‌బీఐ అధికార ప్రతినిధి ఒక ప్రకటన పేర్కొన్నారు.

ఇయాన్ గ్రిల్లాట్‌కు భారత్ ఆహ్వానం

ఇయాన్ గ్రిల్లాట్‌కు భారత్ ఆహ్వానం

కాన్సస్ జాత్యహంకార దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ఇయాన్ గ్రిల్లాట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని కాన్సాస్ హెల్త్ సిస్టమ్ యూ నివర్సిటీ తెలిపింది. చేతికి, ఛాతికి బుల్లెట్ గాయాలైనందున ఆయన కోలుకోవడానికి మరికొంత కాలం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఆ ఘటన జరిగినప్పటి నుంచి గ్రిల్లాట్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. భారత్‌ను సందర్సించాలని హోస్టన్‌లోని భారత కాన్సుల్ జనరల్.. గ్రిల్లాట్‌ను ఆహ్వానించారు.

English summary
IT outsourcers have little to worry about during this year's lottery for the H1-B immigrant worker visa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X