వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేలిపోయిన రసాయన పరిశ్రమ: కిలోమీటర్ దూరం వరకు వినిపించిన పేలుడు శబ్దం

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలో భారీ పేలుడు సంభవించింది. గురువారం ఉదయం ఓ రసాయనిక పరిశ్రమలో చోటు చేసుకున్న ఈ పేలుడులో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఝియాంగ్షు ప్రావిన్స్ యాంగ్ చెన్ ప్రాంతంలోని తియాన్ఝియా రసాయనిక పరిశ్రమలో ఈ పేలుడు సంభవించింది.

గులాబీ గూటికి నామా : కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ గులాబీ గూటికి నామా : కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్

పేలుడు సమయంలో పలువురు కార్మికులు పరిశ్రమలో రోజువారీ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఊహించని విధంగా, ఒక్కసారిగా సంభవించిన పేలుడులో రసాయనిక పరిశ్రమలో అగ్నికీలలు ఎగిసి పడ్డాయి. గ్ఝియాన్గ్షుయ్ ఎకో-కెమికల్ ఇండస్ట్రీయల్ జోన్ లో ఈ పరిశ్రమ ఉంది. గురువారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:48 నిమిషాలకు పేలుడు సంభవించింది.

Explosion At Chemical Plant In China six died

పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి ప్రకంపించింది. పేలుడు చోటు చేసుకున్న వెంటనే అక్కడ 2.2 తీవ్రతతో భూమి ప్రకంపించింది. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు సంఘటానస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సుమారు 30 మందికి పైగా కార్మికులు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం.

ఈ రసాయనిక పరిశ్రమకు కిలోమీటర్ దూరంలో ఓ కిండర్ గార్టెన్ ఉంది. అక్కడి దాకా పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు తీవ్రతకు కిటికీ అద్దాలు పగిలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పెద్ద శబ్దంతో రసాయనిక పరిశ్రమ పేలిపోయిన వెంటనే సుమారు 50 అడుగుల ఎత్తు వరకు అగ్నికీలలు ఎగిసిపడ్దాయి. సంఘటనాస్థలంలో దట్టమైన పొగ అలుముకుంది.

English summary
Six people have been killed and 30 others were injured in a massive explosion that rocked eastern China after a chemical plant suffered a blast on Thursday. The blast was reported from a facility operated by Tianjiayi Chemical in Yancheng of the Jiangsu province, city officials were quoted as saying. A video shared by Beijing News on Weibo, China's alternative to Twitter, showed a massive explosion, with flames engulfing till the top of the plant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X