వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్‌డౌన్‌ను ఎత్తేసే పరిస్థితులు అక్కడ లేవు: జూన్ 1 వరకు పొడిగింపు: ఈ సారి మరింత కఠినంగా:

|
Google Oneindia TeluguNews

లండన్: కరోనా వైరస్ వల్ల అమెరికా తరువాత దారుణంగా దెబ్బతిన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. కరోనా వైరస్ మరణాల సంఖ్యలో యూరప్ దేశాలన్నిటి కంటే టాప్‌లో కొనసాగుతోంది. కరోనా వైరస్‌కు ఇప్పటికే 31 వేల మందికి పైగా బ్రిటీషర్లు బలి అయ్యారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సైతం చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. కరోనా పాజిటివ్‌గా తేలిన ఆయన వారం రోజుల పాటు ఆసుపత్రి పాలయ్యారు. వైరస్ తీవ్రత ఇంకా చల్లారకపోవడంతో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు ప్రకటించింది.

నెల్లూరులో మినీ ఎల్జీ పాలిమర్స్: కెమికల్స్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం: ఘాటు వాసనతో ఉక్కిరిబిక్కిరినెల్లూరులో మినీ ఎల్జీ పాలిమర్స్: కెమికల్స్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం: ఘాటు వాసనతో ఉక్కిరిబిక్కిరి

 జూన్ 1 వరకు పొడిగింపు..

జూన్ 1 వరకు పొడిగింపు..

లాక్‌డౌన్‌ను జూన్ 1వ తేదీ వరకు పొడిగించినట్లు బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాల రేటులో ఇప్పుడిప్పుడే కొద్దిగా వేగం మందగించిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చేనెల 1వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించినట్లు తెలిపారు. ఇప్పుడున్న లాక్‌డౌన్ పరిస్థితులను మరింత కఠినం చేస్తామని అన్నారు. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల దాని తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టిందని, ఇవే పరిస్థితులను మరికొంతకాలం పాటు అమలు చేయడం వల్ల పూర్తిగా దాన్ని నియంత్రించడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

గడువు దాటిన తరువాతే సడలింపులు..

గడువు దాటిన తరువాతే సడలింపులు..

ఏవైనా సడలింపులను ఇవ్వదలచుకుంటే.. జూన్ 1వ తేదీ తరువాతేనని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. పాఠశాలలు, విద్యాసంస్థలతో పాటు కొన్ని బహిరంగ ప్రదేశాలను కూడా తాజాగా విధించిన గడవును దాటిన తరువాతే తెరిచేలా చర్యలను తీసుకుంటామని అన్నారు. దీనికి సంబంధించిన దశలవారీ ప్రణాళికను ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్‌ను ఎత్తేయడానికి అనువైన పరిస్థితులు లేవని బోరిస్ జాన్సన్ తేల్చి చెప్పారు. విదేశాల నుంచి వచ్చే బ్రిటీషర్లకు క్వారంటైన్ తప్పనిసరి చేశామని, దానికి అంగీకరించిన వారే స్వదేశానికి రావాల్సి ఉంటుందనీ ఆయన స్పష్టం చేశారు.

Recommended Video

Vande Bharat Mission: First Flight From Kuwait Arrive in Hyderabad With 163 Indians
పరిశ్రమలు యధాతథంగా..

పరిశ్రమలు యధాతథంగా..

వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలకు ఇదివరకే పాక్షికంగా సడలింపులను ఇచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం. వాటినే కొనసాగిస్తామని అన్నారు. జూన్ 1 తరువాత పాఠశాలలకు తెరవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని, దీనికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని చెప్పారు. కళాశాలలు, విద్యాసంస్థలకు మాత్రం జూన్ 1 తరువాత కూడా లాక్‌డౌన్ కొనసాగించే అవకాశాలు లేకపోలేదని అన్నారు. యూనివర్శిటీలు, వాటి అనుబంధ కళాశాలలను సెప్టెంబర్ వరకు మూసి ఉంచడానికి అవసరమైన చర్యలను తీసుకున్నామని చెప్పారు. పబ్లులు, క్లబ్బుల వంటి ఎంటర్‌టైన్‌మెంట్లను తెరవడానికి ఇప్పట్లో ఆదేశాలను ఇవ్వలేమని అన్నారు.

English summary
British Prime Minister Boris Johnson on Sunday announced a phased plan to ease a nationwide coronavirus lockdown, with schools and shops to begin opening from June 1 as long as infection rates stay low. In a televised address, Mr. Johnson also announced plans to introduce quarantine for people arriving in Britain by air to prevent new infections from abroad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X