వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారులకు కరోనా రాదంటూ ట్రంప్ పోస్ట్- ఫేక్ అంటూ తొలగించిన ఫేస్ బుక్, ట్విట్టర్..

|
Google Oneindia TeluguNews

నిత్యం ఏదో వివాదంతో సావాసం చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కరోనాకు సంబంధించిన ఓ కీలక విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఇందులో చిన్నారులకు రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని, కాబట్టి కరోనా సోకదంటూ ట్రంప్ పోస్టులు పెట్టారు. తాజాగా ఫాక్స్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన ఇవే విషయాల క్లిప్పింగ్స్‌ ను ట్రంప్ తన పోస్టులకు జత చేశారు.

Recommended Video

Donald Trump : Facebook Twitter Removed Donald Trump's Post Over False Claim || Oneindia Telugu

ట్రంప్ పోస్టులపై ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్నారులు, వృద్ధులకు కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సైతం హెచ్చరికలు చేస్తుంటే ట్రంప్ బాధ్యతాయుత స్ధానంలో ఉండి ఇలాంటి పోస్టులు పెట్టడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్ధ విడుదల చేసిన గణాంకాలను ఆధారంగా చేసుకుని తాను ఈ విషయాలు చెబుతున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.

facebook and twitter delete us president trumps tweet on coronavirus misinformation

ఇలాంటి పోస్టులను ఎంకరేజ్ చేయడం ఏంటని ట్విట్టర్, ఫేస్ బుక్ లపైనా విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆయా సంస్ధలు తాజాగా ట్రంప్ పోస్టును తమ ఫ్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాయి. ఈ పోస్టులు ప్రజలను, నెటిజన్లను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని భావించినందువల్లే తొలగించినట్లు ఫేస్ బుక్, ట్విట్టర్ వేర్వేరుగా ప్రకటించాయి. దీంతో ఈ వివాదం సద్దుమణిగినట్లయింది. అయితే ట్రంప్ ప్రతినిధి కర్టెనీ పారెల్లా సామాజిక దిగ్గజాల చర్యను తప్పుబట్టారు. ట్రంప్ వాస్తవాలు మాట్లాడారని, సోషల్ మీడియా సంస్ధలు న్యాయనిర్ణేతల్లా వ్యవహరించి అమెరికా అధ్యక్షుడి పోస్టులు తొలగించడమేంటని మండిపడ్డారు.

English summary
social media giants facebook and twitter have removed a post from us president donald trump in which he claimed that children were almost immune to covid 19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X