వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ కోవిడ్ పోస్టుపై సోషల్ మీడియా దిగ్గజాలు చర్యలు... తప్పుడు సమాచారం..!

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్ మరియు ట్విటర్‌లు చర్యలకు దిగాయి. గతవారం కరోనావైరస్‌పై ట్రంప్ చేసిన పోస్టింగులపై ఈ రెండు దిగ్గజ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గతవారం తనకు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌నకు, కరోనావైరస్ సోకిందంటూ ఫేస్‌బుక్ మరియు ట్విటర్‌లో ట్రంప్ పోస్టు చేశారు. అయితే కరోనావైరస్ సోకిన తర్వాత క్వారంటైన్ సమయం ముగియకముందే ట్రంప్‌ మెలానియా ట్రంప్‌లో హాస్పిటల్ నుంచి బయటకు వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

ఎవరికైనా సరే కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయితే కనీసం రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నిబంధనలు వెల్లడిస్తున్నాయి. అది అధ్యక్షుడైనా సరే సామాన్యుడైనా సరే. కానీ కరోనా వైరస్ సోకిన ట్రంప్ దంపతులు మాత్రం ఎంచక్కా క్వారంటైన్ గడువు ముగియకముందే హాస్పిటల్ నుంచి బయటపడ్డారు. ఇది చూసిన అమెరికా దేశస్తులతో పాటు ప్రపంచదేశాల ప్రజలు కూడా షాకయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు ఫేస్‌బుక్ మరియు ట్విటర్‌లు ట్రంప్ పోస్టును తొలగించేశాయి.

Facebook and Twitter take action against US President Trumps covid Tweet

ప్రమాదకరమైన కరోనావైరస్ మహమ్మారి గురించి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా నిబంధనలు ఉల్లఘించినందుకు ట్రంప్ చేసిన పోస్టుపై చర్యలు తీసుకున్నారు. అంతేకాదు కరోనా అనేది చిన్నపాటి ఫ్లూ లాంటిదని ట్రంప్ పేర్కొనడంపై సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు తీవ్ర అభ్యంతరంను వ్యక్తం చేశాయి.అయితే ఫేస్‌బుక్ సంస్థ పోస్టును తొలగించడానికి ముందే అది 26వేల సార్లు షేర్‌ అయ్యిందని పేర్కొంది. ఇదిలా ఉంటే ట్విటర్‌ కూడా చర్యలు తీసుకుంది. ఆ పోస్టును ఎవరూ రీట్వీట్ చేయకుండా రీట్వీట్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసింది. అంతేకాదు ట్రంప్ చేసిన ట్వీట్ కరోనావైరస్‌పై తప్పుడు సమాచారంను వ్యాప్తి చేసేలా ఉందని ట్విటర్ పేర్కొంది.

Recommended Video

Donald Trump : నిబంధనలకు విరుద్ధంగా Trump పోస్ట్.. నిర్మోహమాటంగా తొలగించిన Facebook || Oneindia

ఇక కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కు ధరించేందుకు ఈ అగ్రరాజ్యపు అధినేత తిరస్కరించారు. అయితే ట్రంప్‌కు పాజిటివ్‌గా వచ్చిన తర్వాత మాస్కు ధరించడం ప్రారంభించారు. కొన్ని సందర్భాల్లో ముఖానికి మాస్కు ధరించి ట్రంప్ కనిపించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలు వేడి రాజుకుంటుంన్నందున ప్రచారంలో హీట్ పెంచుతున్నారు ట్రంప్. జోబిడెన్‌కు పోటీగా ఎక్కడా ప్రచారంలో తగ్గకూడదనే దృఢ నిశ్చయంతో ఏ ఒక్క క్యాంపెయిన్‌ మిస్ కాకుండా చూసుకుంటున్నారు.

English summary
Facebook and Twitter took action on Trump post saying that the post was misleading and giving misinformation on covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X