బికినీలో ప్లస్ సైజ్ మోడల్: నో చెప్పిన ఫేస్బుక్, సారీ
కాలిఫోర్నియా: బికినీ ధరించి ఉన్న ఓ లావుపాటి మోడల్ యాడ్ ఇమేజ్‌ని తొలుత ఫేస్బుక్లో పెట్టేందుకు నిరాకరించిన ఫేస్బుక్ క్షమాపణ చెప్పింది. ఈ విషయంలో ఆ సంస్థ తాజాగా క్షమాపణలు కోరింది. ప్లస్ సైజ్ మోడల్ యాడ్ ఇమేజ్‌ని పెట్టేందుకు ఆ సంస్థ తొలుత అనుమతించలేదు.
ఆ ఫోటో తమ సంస్థ నిబంధనలకు అనుగుణంగా లేదని పేర్కొంది. న్యూయార్క్‌కి చెందిన సంస్థ 'టెస్ హాలీడే' సంస్థ ప్రచార ఫోటోకు అనుమతించలేదు. ఆ తర్వాత ఈ ఇమేజ్ విషయంలో ఫేస్బుక్ మళ్లీ పునరాలోచించి ఆ యాడ్‌కి ఓకే చెప్పింది.
సంస్థ ఈ విషయమై మాట్లాడుతూ.. తమ ఉద్యోగుల బృందం వారానికి లక్షల సంఖ్యలో యాడ్ ఇమేజ్‌లను పరిశీలించి వాటిని అనుమతిస్తారని పేర్కొంది. అందులో భాగంగా ఈ తప్పిదం జరిగిందని, అందుకు క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొంది.
ఆ యాడ్ ఇమేజ్ తమ యాడ్ పాలసీలకు అనుగుణంగానే ఉందని గ్రహించిన తర్వాత దాన్ని ఫేస్బుక్లో పెట్టేందుకు అనుమతిచ్చామని పేర్కొంది. ఫేస్బుక్ ఇటీవల ఆరోగ్యం, శరీర బరువుకు సంబంధించిన యాడ్లను అనుమతించడంలో జాగ్రత్త వహిస్తోంది.