వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిన్‌పింగ్ పేరును అత్యంత వల్గర్‌గా.. చైనా అధ్యక్షుడికి ఫేస్‌బుక్ క్షమాపణ..

|
Google Oneindia TeluguNews

మయన్మార్ పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేరు ఫేస్‌బుక్‌ ఇంగ్లీష్ అనువాదంలో అభ్యంతరకరంగా కనిపించింది. మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ అంగ్‌సాన్ సూకీ జిన్‌పింగ్ పర్యటనపై తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో బర్మీస్ భాషలో పోస్టు చేయగా.. దాని ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో జిన్‌పింగ్ పేరు కాస్త 'మిస్టర్ షిట్‌హోల్'గా కనిపించింది. ఫేస్‌బుక్ నుంచి జరిగిన ఈ తప్పిదానికి సంస్థ యాజమాన్యం క్షమాపణలు తెలిపింది. టెక్నికల్ సమస్యను పరిష్కరించినట్టు వెల్లడించింది. ఇలాంటి తప్పిదం మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పింది. ఇలాంటి సమస్య తలెత్తడాన్ని తమ పనితీరుకు నిదర్శనంగా భావించవద్దని,జరిగిన తప్పుకు క్షమాపణలు చెబుతున్నామని ఫేస్‌బుక్ తెలిపింది.

Facebook Apologises After Vulgar Translation of Chinese President Name During His Visit to Myanmar

కాగా,గతంలోనూ ఫేస్‌బుక్‌లో బర్మీస్ నుంచి ఇంగ్లీష్ అనువాదంలో తప్పులు దొర్లాయి. కొన్ని సందర్భాల్లో అత్యంత అభ్యంతరకరమైన,అసభ్యకరమైన పదాలు కనిపించాయి. 2017లో సైనిక చర్యతో 7,30,000మంది రోహింగ్యా ముస్లింలు మయన్మార్‌ను విడిచిపెట్టినట్టుగా కథనాలు వచ్చాయి. మయన్మార్‌లో మారణహోమం జరిగిందని ఐరాస సైతం పేర్కొంది. దీనికి సంబంధించి ఫేస్‌బుక్‌లో బర్మీస్ భాషలో పెట్టిన పలు పోస్టులు ఇంగ్లీష్ అనువాదంలో పొంతన లేని పదాలను చూపించాయి. '

ఇలాంటి తప్పిదాలతో 2018లో తాత్కాలికంగా బర్మీస్ నుంచి ఇంగ్లీష్ అనువాదం ఆప్షన్‌ను ఫేస్‌బుక్ నిలిపివేసింది. కొద్దిరోజులకు ఆ ఆప్షన్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ.. అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు దొర్లుతున్నాయి. అమెరికా తర్వాత ఫేస్‌బుక్ సంస్థకు ఎక్కువ రెవెన్యూ వస్తు్న్నది చైనా నుంచే కావడంతో.. ఆ దేశ అధ్యక్షుడి విషయంలోనే ఇలా జరిగినందుకు ఫేస్‌బుక్ సంస్థ విచారిస్తోంది. ప్రస్తుతం చైనాలో లాభదాయకమైన ప్రకటనల వ్యాపారంపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి కొత్త ఇంజనీరింగ్ బృందాన్ని ఏర్పాటు ఫేస్‌బుక్ ఏర్పాటు చేసుకుంటోంది.

English summary
మయన్మార్ పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేరు ఫేస్‌బుక్‌ ఇంగ్లీష్ అనువాదంలో అభ్యంతరకరంగా కనిపించింది. మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ అంగ్‌సాన్ సూకీ జిన్‌పింగ్ పర్యటనపై తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో బర్మీస్ భాషలో పోస్టు చేయగా.. దాని ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో జిన్‌పింగ్ పేరు కాస్త 'మిస్టర్ షిట్‌హోల్'గా కనిపించింది. ఫేస్‌బుక్ నుంచి జరిగిన ఈ తప్పిదానికి సంస్థ యాజమాన్యం క్షమాపణలు తెలిపింది. టెక్నికల్ సమస్యను పరిష్కరించినట్టు వెల్లడించింది. ఇలాంటి తప్పిదం మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పింది. ఇలాంటి సమస్య తలెత్తడాన్ని తమ పనితీరుకు నిదర్శనంగా భావించవద్దని,జరిగిన తప్పుకు క్షమాపణలు చెబుతున్నామని ఫేస్‌బుక్ తెలిపింది.కాగా,గతంలోనూ ఫేస్‌బుక్‌లో బర్మీస్ నుంచి ఇంగ్లీష్ అనువాదంలో తప్పులు దొర్లాయి. కొన్ని సందర్భాల్లో అత్యంత అభ్యంతరకరమైన,అసభ్యకరమైన పదాలు కనిపించాయి. 2017లో సైనిక చర్యతో 7,30,000మంది రోహింగ్యా ముస్లింలు మయన్మార్‌ను విడిచిపెట్టినట్టుగా కథనాలు వచ్చాయి. మయన్మార్‌లో మారణహోమం జరిగిందని ఐరాస సైతం పేర్కొంది. దీనికి సంబంధించి ఫేస్‌బుక్‌లో బర్మీస్ భాషలో పెట్టిన పలు పోస్టులు ఇంగ్లీష్ అనువాదంలో పొంతన లేని పదాలను చూపించాయి. 'ఇలాంటి తప్పిదాలతో 2018లో తాత్కాలికంగా బర్మీస్ నుంచి ఇంగ్లీష్ అనువాదం ఆప్షన్‌ను ఫేస్‌బుక్ నిలిపివేసింది. కొద్దిరోజులకు ఆ ఆప్షన్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ.. అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు దొర్లుతున్నాయి. అమెరికా తర్వాత ఫేస్‌బుక్ సంస్థకు ఎక్కువ రెవెన్యూ వస్తు్న్నది చైనా నుంచే కావడంతో.. ఆ దేశ అధ్యక్షుడి విషయంలోనే ఇలా జరిగినందుకు ఫేస్‌బుక్ సంస్థ విచారిస్తోంది. ప్రస్తుతం చైనాలో లాభదాయకమైన ప్రకటనల వ్యాపారంపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి కొత్త ఇంజనీరింగ్ బృందాన్ని ఏర్పాటు ఫేస్‌బుక్ ఏర్పాటు చేసుకుంటోంది. Facebook Inc said on Saturday it was working to find out how Chinese leader Xi Jinping’s name appeared as “Mr Shithole” in posts on its platform when translated into English from Burmese, apologising for any offence caused and saying the problem had been fixed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X