వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎందుకోసమో: ఆ సోషల్ మీడియా యాప్‌లో మార్క్ జుకర్‌బర్గ్ సీక్రెట్ అకౌంట్

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఒక సీక్రెట్ అకౌంట్ ఉంది. అయితే ఇది మరో సోషల్ మీడియా యాప్‌కు సంబంధించిన అకౌంట్. జూకర్‌బర్గ్ ‌కు ఈ యాప్‌లో అకౌంట్‌ ఉన్నట్లు నిర్థారించడం కూడా జరిగింది. ఆ యాప్ అకౌంట్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌కు అనుసంధానమై ఉంది. ఇంతకీ ఏంటా యాప్.. ఏమా స్టోరీ..?

 సీక్రెట్ అకౌంట్ మెయిన్‌టెయిన్ చేస్తున్న మార్క్ జుకర్‌బర్గ్

సీక్రెట్ అకౌంట్ మెయిన్‌టెయిన్ చేస్తున్న మార్క్ జుకర్‌బర్గ్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ టిక్‌టాక్‌లో ఓ సీక్రెట్ అకౌంట్‌ను మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. అయితే ఇది వెరిఫైడ్ అకౌంట్ కాదు. అంటే అకౌంట్ ఒరిజినలా నకిలీదా అని చెప్పేందుకు అకౌంట్ పై టిక్ మార్క్ ఉంటుంది. కానీ జుకర్‌బర్గ్ మెయింటెయిన్ చేస్తున్న టిక్ టాక్ అకౌంట్‌కు టిక్ మార్క్ లేనప్పటికీ అది తనదే అని తెలుస్తోంది. ఎందుకంటే టిక్‌టాక్ అకౌంట్ @finkd జుకర్‌బర్గ్ ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌కు లింక్ అయ్యింది.

 ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా వచ్చిన టిక్‌టాక్

ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా వచ్చిన టిక్‌టాక్

ఇక మార్క్ జుకర్ బర్గ్ టిక్‌టాక్‌పై వీడియోలు పోస్టు చేయనప్పటికీ 61 మంది సెలబ్రిటీలను ఆయన ఫాలో అవుతున్నారు. ఇందులో అరియానా గ్రాండ్, షాక్‌లాంటి వారున్నారు. టిక్‌టాక్ సూపర్‌స్టార్స్ లోరెన్ గ్రే, జాకబ్ సర్టోరియస్‌లను కూడా జుకర్‌బర్గ్ ఫాలో అవుతున్నారు. అయితే జుకర్‌బర్గ్ అకౌంట్‌కు 4వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫేస్‌బుక్‌ సంస్థకు చెందిన ఇన్స్‌టాగ్రామ్‌కు పోటీగా టిక్‌టాక్ వచ్చింది. ఇప్పుడు ఆ టిక్‌టాక్‌లోనే జుకర్‌బర్గ్ ఒక సీక్రెట్ అకౌంట్ మెయిన్‌టెయిన్ చేయడం విశేషం. ఇక ఇండియాలో అయితే ఇన్స్‌టాగ్రామ్‌కంటే టిక్‌టాక్ యాప్‌కే ఎక్కువగా పాపులారిటీ లభించింది. ఇదే విషయం జుకర్‌బర్గ్ కూడా ఒప్పుకున్నారు. అంతేకాదు అమెరికాలో కూడా టిక్‌టాక్ యాప్‌కు మంచి ఆదరణ లభిస్తోందన్నారు.

 టిక్‌టాక్‌కు భారత్‌లో మంచి ఆదరణ ఉంది: మార్క్

టిక్‌టాక్‌కు భారత్‌లో మంచి ఆదరణ ఉంది: మార్క్

ఇక టిక్‌టాక్ యాప్ గురించి చెప్పాలంటే నెలకు 120 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు భారత్‌లో ఉన్నారని దీని మాతృసంస్థ బైట్ డాన్స్ తెలిపింది. అయితే ఇన్స్‌టాగ్రామ్‌కు ఎంతమంది యాక్టివ్ యూజర్లు ఉన్నారో అనేదానిపై ఫేస్‌బుక్ స్పష్టత ఇవ్వనప్పటికీ.. ఇన్స్‌టాగ్రామ్‌కు భారత్‌లో 70మంది మిలియన్‌ యూజర్లు ఉన్నట్లు సమాచారం. టిక్‌టాక్‌పై ప్రశంసుల కురిపించిన జుకర్‌బర్గ్ ట్రెండ్‌కు మించి ఇంకా ఏదో చేయాలంటే అందుకు సమయం పడుతుందన్నారు.

 టిక్‌టాక్‌ను కొనుగోలు చేసిన చైనా టెక్ దిగ్గజ సంస్థ

టిక్‌టాక్‌ను కొనుగోలు చేసిన చైనా టెక్ దిగ్గజ సంస్థ

చైనాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థ బైట్ డ్యాన్స్ లిప్-సింక్ యాప్ మ్యూజికల్.లీ అనే యాప్‌ను 2017లో కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.800 మిలియన్ డాలర్లను చెల్లించింది. దీన్ని కొనుగోలు చేసి ప్రస్తుతం ఉన్న వీడియో యాప్ డాయిన్‌తో విలీనం చేసినట్లు సమాచారం. అయితే 2016లోనే మార్క్ జుకర్‌బర్గ్ మ్యూజికల్.లీ యాప్‌ కొనుగోలుకు ఆసక్తి చూపి చర్చలు కూడా జరిపారు. అయితే డీల్ కుదరకపోవడంతో జుకర్‌బర్గ్ సైడ్ అయిపోయారు.

English summary
Facebook CEO Mark Zuckerberg has a secret account on TikTok with no posts and more than 4,000 followers, according to a report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X