వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ సీఈఓ పితృత్వ సెలవు, అమెరికాలో చర్చ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

త్వరలో తండ్రి కాబోతున్న ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రెండు నెలల పాటు పితృత్వ సెలవు తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని ఆయన పేర్కొన్నారు. ఆయన భార్య ప్రిస్కిల్లా చాన్ త్వరలోనే ఆడ బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా జుకర్స్ జీవితంలో కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందన్నారు. అందుకే తన తొలి బిడ్డ పుట్టిన అనంతరం రెండు నెలలు పాటు సెలవు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

జుకర్‌బర్గ్ భార్య ప్రిస్కిల్లా చాన్ (30) పలు గర్భస్రావాల అనంతరం ఇప్పుడు ఆడబిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నా, ఈ ప్రపంచంలోకి కొత్తగా వచ్చే బిడ్డల కోసం పనికి దూరంగా ఉండటం మంచిదేనని ఒక ఆన్‌లైన్ పోస్టులో వెల్లడించారు.

నేను నా భార్య మా జీవితంలోనికి ప్రవేశించనున్న చిన్నారి రాకకోసం మానసికంగా సిద్ధమౌతున్నట్లు, వారి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు జుకెర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

Facebook CEO Mark Zuckerberg to take two months of paternity leave

అయితే తన కుమార్తె ఎప్పుడు ఈ ప్రపంచంలోకి వస్తుందనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. గతంలో యాహూ సీఈవో మారిస్సా మేయర్ కవలలకు జన్మనిచ్చినప్పుడు తీసుకున్న సెలవుతో పోలిస్తే జుకెర్‌బర్గ్ ఆరువారాలు అధికంగా పనికి దూరంగా ఉండబోతున్నారు.

ఫేస్‌బుక్ కంపెనీలో పని చేసే ఉద్యోగులు 4 నెలల పాటు పితృత్వ, మాతృత్వ సెలవు తీసుకునే వీలుంది. అయితే ఉద్యోగులకు ఇచ్చిన దానితో పోలిస్తే ఈ సమయం రెండు నెలలు తక్కువగానే ఉంది.

కాగా నెట్‌ఫ్లిక్స్ అనే సంస్ధ తన ఉద్యోగులకు ఏకంగా ఏడాది పాటు వేతనంతో కూడిన మాతృత్వ సెలవు ప్రకటించడం అమెరికాలో చర్చలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా పేరొందిన 31 ఏళ్ల జుకర్‌బర్గ్ అమెరికాలో అత్యంత బిజీ జీవితం గడిపే టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు.

English summary
Facebook Chief Executive Officer Mark Zuckerberg said on Friday he will take two months of paternity leave after his daughter's birth, a strong statement from one of the busiest and most powerful US executives on the importance of family time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X