వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి చిక్కుల్లో..: ఫేస్‌బుక్‌కు యూకే భారీ జరిమానా

|
Google Oneindia TeluguNews

లండన్: ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కేంబ్రిడ్జ్‌ అనలిటికా స్కాండల్‌తో మరోసారి చిక్కుల్లో పడింది. ఇప్పటికే ఈ స్కాండల్‌ విషయంలో అమెరికా చట్టసభ్యుల ముందు తలవంచిన ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌.. ఈసారి యూకేలో భారీ జరిమానాను ఎదుర్కోబోతున్నారు.

 Facebook faces £500,000 fine from UK data watchdog

తాజాగా బ్రిటన్‌ డేటా రెగ్యులేటరీ ఫేస్‌బుక్‌పై చర్యలు చేపట్టింది. యూజర్ల అనుమతి లేకుండా కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు డేటా షేర్‌ చేసి.. తమ చట్టాలను బ్రేక్‌ చేసినందుకు గానూ 6,62,900 డాలర్ల(5లక్షల పౌండ్లు) జరిమానా అంటే సుమారు నాలుగున్నర కోట్ల జరిమానాను విధించింది.

యూకే డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను రెండు విధాలుగా బ్రేక్‌ చేసినందుకు తాము విధించిన ఈ గరిష్ట జరిమానాను చెల్లించాలని ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్స్‌ ఆఫీసు(ఐసీఓ) ఆదేశించింది. ప్రజల సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో ఫేస్‌బుక్‌ విఫలమైందని ఐఓసీ పేర్కొంది.

English summary
The UK's data protection watchdog intends to fine Facebook £500,000 for data breaches - the maximum allowed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X