వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హ్యాకింగ్: ఇలా చేస్తేనే మీ ఫేస్‌బుక్ అకౌంట్ సేఫ్

|
Google Oneindia TeluguNews

లండన్: ఫేస్‌బుక్ నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సులువుగా దొంగిలించడానికి వీలుందని బ్రిటన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, సాల్ట్ ఏజెన్సీ టెక్నికల్ డైరెక్టర్ రజా మొయినుద్దీన్ నిరూపించారు. మీ అకౌంట్ లో ప్రొఫైల్లో ఫోన్ నెంబర్ ఫీడ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించమని సలహా ఇస్తున్నారు.

యూజర్స్, పిక్చర్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయమంటూ ఫేస్‌బుక్ యాజమాన్యం గత కొంతకాలంగా ప్రోత్సహిస్తోంది.

అయితే ఎవరైనా ఫేస్‌బుక్‌లో డిఫాల్ట్ ప్రైవసీ సెట్టింగ్స్‌ వాడుతున్నట్లయితే.. అతని ఫోన్ నెంబర్ ద్వారా ఆ యూజర్ పేరును, ఫోటో, లొకేషన్‌, ఇతరత్రా సమాచారాన్ని అత్యంత సులువుగా దొంగలించవచ్చని తెలిపారు.

Facebook loophole exposes private phone numbers, here’s how to close it

అంతేగాక, అతని ఫేస్‌ బుక్ ఖాతాలోకి వెళ్లి కామెంట్స్ కూడా చేయవచ్చని ఆ యువ టెక్కీ తెలిపాడు. దీంతో యూజర్ల సమాచారం హ్యాకర్లు, ఇతర మార్కెటింగ్ సంస్థలకు విక్రయించే అవకాశాలున్నాయని ఆయన హెచ్చరించారు.

ఇలా నష్టపోకుండా ఉండాలంటే ఫేస్ బుక్ సెట్టింగ్స్ లో 'హూ కెన్ ఫైండ్ మీ?' అనే చోట 'ఎవ్రీవన్ / పబ్లిక్' ఆప్షన్‌ను తొలగించాల్సి ఉంటుంది. అలా చేస్తే మీ ప్రొఫైల్ ఇతరులెవరికీ కనిపించదు. అంతకన్నా ముందు ఫోన్ నెంబరును యాడ్ చేసుకోకుండా ఉంటే మరింత మంచిదని పేర్కొన్నారు.

English summary
Security is one tough business, as it seems like every day brings a new flaw or vulnerability. Today’s finding is a big one, since it could impact nearly 1.5 billion Facebook users.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X