వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలందరికీ లింగ వివక్షలేని వేతనాలు: మైక్రోసాఫ్ట్, ఎఫ్‌బి

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: లింగ వివక్ష లేకుండా తమ కంపెనీల్లో పని చేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లందరికీ సమాన వేతనాలు అందిస్తామని సోషల్ నెట్‌వర్క్ దిగ్గజం ఫేస్‌బుక్, సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీలు ప్రకటించాయి.

ఈ సమానవేతనాలు ఈ మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని సదరు సంస్థలు వెల్లడించాయి. కాగా, బోస్టన్‌కు చెందిన పెట్టుబడి సంస్థ అర్జున్ క్యాపిటల్ ఒత్తిడి మేరకే ఈ రెండు సంస్థలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయని తెలుస్తోంది.

 Facebook, Microsoft Say They Offer Equal Pay to Women, Men

ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌తో పాటు యాపిల్ వంటి మరో 9 టెక్నాలజీ సంస్థలు తమ ఉద్యోగులకు సంబంధించిన వేతన సమాచారం వెల్లడిపై అర్జున్ క్యాపిటల్ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

ఈ సందర్భంగా అర్జున్ క్యాపిట్ పార్టనర్ నతాసా ల్యాంబ్ మాట్లాడుతూ.. లింగ వివక్ష లేకుండా ప్రతిభ ఉన్న మహిళలకు అత్యున్నత పదవులు ఇవ్వడం ద్వారా పోటీ వాతావరణం పెరుగుతుందని తెలిపారు. కాగా, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ నిర్ణయంతో మరిన్ని ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Facebook Inc. and Microsoft Corp., two of the technology companies pressed by an investment firm for more pay transparency, disclosed that they pay their male and female employees equally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X