వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ బంపర్ ఆఫర్: ఉద్యోగులకు 6 నెలల బోనస్, ‘కరోనా’నే కారణం!

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: కరోనావైరస్(కొవిడ్-19) వైరస్ అంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ వైరస్ పట్ల ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రార్థనాలయాలపై కూడా ఈ వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది.

ఫేస్‌బుక్ ఉద్యోగులకు బోనస్ ప్లస్..

ఫేస్‌బుక్ ఉద్యోగులకు బోనస్ ప్లస్..

ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించాయి. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కరోనాను ఎదుర్కొనేందుకు బోనస్ తోపాటు 1000 డాలర్లను తమ ఉగ్యోగులకు ఇస్తున్నట్లు ప్రకటించింది.

45 వేల మంది ఉద్యోగులకు..

45 వేల మంది ఉద్యోగులకు..

కరోనా కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వారి శ్రమను గుర్తించి, ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఈ బోనస్ ఇస్తున్నట్లు ఫేస్‌బుక్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ పేరుతో ఉద్యోగులకు రాసిన అంతర్గత నోట్‌లో వెల్లడించింది. సంస్థలోని సుమారు 45వేల మంది శాశ్వత ఉద్యోగులు, మరికొన్ని వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. అయితే, శాశ్వత ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Recommended Video

Dhoni's Organic Farming & Driving Pitch Roller Videos Viral | One Man, Different Roles
ఫేస్‌బుక్‌పై కరోనా తీవ్ర ప్రభావం..

ఫేస్‌బుక్‌పై కరోనా తీవ్ర ప్రభావం..

కాగా, ఫేస్‌బుక్ సంస్థపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది. స్టాక్ మార్కెట్లో అనిశ్చితులతో షేర్ విలువ గత ఏడాదితో పోలిస్తే 28 శాతం పడిపోవడం గమనార్హం. ఫిబ్రవరి 27న జరగాల్సిన వార్షిక సాఫ్ట్‌వేర్ డెవలపర్ల సమావేశాన్ని కూడా కరోనా కారణంగా రద్దు చేసింది. ఫేస్‌బుక్ బాటలోనే మరికొన్ని సంస్థలు కూడా నడుస్తున్నాయి. అమెరికాకు చెందిన వర్క్‌డే ఫైనాన్షియల్ సంస్థ కూడా తమ ఉద్యోగులకు రెండు వారాల వేతనాన్ని కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు బోనస్‌గా ఇస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలో కూడా కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల మందికి వైరస్ సోకగా.. 8వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

English summary
Social media giant Facebook, has decided to give six-month bonuses and an additional $1,000 (Rs 74,037) to all its employees in order to help them during coronavirus outbreak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X