వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ డిజిటల్ కరెన్సీ: క్రిప్టో కరెన్సీని ప్రారంభించిన సోషల్ మీడియా దిగ్గజ సంస్థ

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: క్రిప్టో కరెన్సీని ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ ప్రారంభిస్తుందనే వార్తలు గత కొన్ని రోజులుగా షికారు చేశాయి. ఈ వార్తలను నిజం చేస్తూ ఫేస్‌బుక్ యాజమాన్యం లిబ్రా పేరుతో డిజిటల్ కరెన్సీ సేవలను ప్రారంభించేందుకు అడుగుముందుకేసింది. ఈ డిజిటల్ కరెన్సీపై పలు అమెరికా ఆర్థిక సంస్థలు, రాజకీయనేతలు విమర్శలు సంధించినప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా యాజమాన్యం డిజిటల్ కరెన్సీని ప్రారంభించింది.

మొత్తం 21 మంది సభ్యులు

మొత్తం 21 మంది సభ్యులు

జెనీవాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రభుత్వేతర సంస్థ లిబ్రా అసోసియేషన్ ఫేస్‌బుక్ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. చార్టర్‌లో మొత్తం 21 మంది సభ్యులను చేర్చింది. ఒరిజినల్‌గా 27 మంది సభ్యులు ఉండాల్సినప్పటికీ వివిధ కారణాల చేత కొన్ని సంస్థలు మధ్యలోనే వెనక్కు తగ్గాయి. ఇందులో వీసా, మాస్టర్‌కార్డు, పేపాల్ వంటి సంస్థలు ఉన్నాయి. ఇక లిబ్రా అసోసియేషన్‌లో మిగిలి ఉన్న సభ్యుల్లో వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్, ఉన్నాయి. ఇక పెద్ద సంస్థలు అయిన ఊబెర్, లిఫ్ట్, స్పాటిఫై మరియు యూరోపియన్ టెలికమ్యూనికేషన్ సంస్థ వోడాఫోన్‌లు కూడా లిబ్రా అసోసియేషన్‌లో ఉన్నాయి. వీటితో పాటు మరో 180 సంస్థలు లిబ్రా అసోసియేషన్‌లో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నాయని లిబ్రా విడుదల చేసిన ప్రకటనలో ఉంది.

 ఫేస్‌బుక్ క్రిప్టో కరెన్సీపై విమర్శలు

ఫేస్‌బుక్ క్రిప్టో కరెన్సీపై విమర్శలు

ఒక దేశం నుంచి మరో దేశంలో ఉన్నవారికి నగదు బదిలీ చేసేందుకు ఫేస్‌బుక్ ప్రైవేట్ కరెన్సీ సిస్టంను తీసుకొస్తుందని ఈ ఏడాదిలో ఆరంభంలో ప్రకటించగానే ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. ఇలా చేస్తే ఫేస్‌బుక్‌లోని వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లిబ్రా చేతుల్లోకి వెళ్లిపోతుందంటూ రాజకీయనాయకులు విమర్శించారు. అయితే ఈ విమర్శల్లో పసలేదంటూ రుజువు చేసింది కాలిఫోర్నియాకు చెందిన మెన్లో పార్క్ అనే సంస్థ. లిబ్రా అసోసియేషన్ చట్టపరమైన సంస్థ అని పేర్కొంది. అసోసియేషన్‌లో ఉన్న ఐదుగురు డైరెక్టర్లలో ఒకరు ఫేస్‌బుక్‌ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ మార్కస్ ఉన్నారు. ఈయనే లిబ్రా సృష్టించడంలో ఈయన హస్తం కూడా ఉంది.

 క్రిప్టో కరెన్సీ గురించి వివరించనున్న మార్క్ జుకర్‌బర్గ్

క్రిప్టో కరెన్సీ గురించి వివరించనున్న మార్క్ జుకర్‌బర్గ్

అండ్రీసెన్‌ హరోవిట్జ్‌తో పాటు క్యాతి హాన్ అనే వెంచర్ క్యాపిటల్ సంస్థ కూడా ఫేస్‌బుక్‌లో పెట్టుబడులు పెట్టింది. ఈ సంస్థ కూడా బోర్డులో ఉంది. ఇక లిబ్రా గురించి చర్చించేందుకు ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ హౌజ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కమిటీ ముందుకు ఈ నెలాఖరులో రానున్నారు. ఈ కమిటీకి ఛైర్మెన్‌గా మ్యాక్సిన్ వాటర్స్ వ్యవహరించనున్నారు. ఈయన లిబ్రా విమర్శకుల్లో ప్రథమ స్థానంలో ఉన్నారు.

 విమర్శకులను సంతృప్తి పరిచాకే లావాదేవీలు

విమర్శకులను సంతృప్తి పరిచాకే లావాదేవీలు

ఇదిలా ఉంటే లిబ్రా పై విమర్శలు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అమెరికా ఆర్థికసంస్థలు పూర్తి స్థాయిలో తమ సంతృప్తిని వ్యక్తం చేశాకే లావాదేవీలు ప్రారంభిస్తామని ఫేస్‌బుక్ మరియు లిబ్రా అసోసియేషన్‌లు తెలిపాయి. ప్రస్తుతం అమెరికా ఆర్థిక నియంత్రణ సంస్థలతో చర్చలు జరుపుతోందని అవి పూర్తయి ఆమోదం లభించాకే మొత్తం ప్రాసెస్‌ను ప్రారంభిస్తామని లిబ్రా పాలసీ మరియు కమ్యూనికేషన్స్ హెడ్ దాంటే డిస్‌పార్ట చెప్పారు. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్ పలువురు వాష్టింగ్టన్ లాబీయిస్టులను నియమించింది.

English summary
Facebook officially moved forward with its plans Monday to create a new digital currency called Libra, despite several high-profile defections from the project and intense criticism from US regulators and politicians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X