వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌ విచిత్ర నిర్ణయం- సెక్సీగా ఉందని ఉల్లిపాయ ఫొటో తొలగింపు- విమర్శలతో వెనక్కి...

|
Google Oneindia TeluguNews

ఈ మధ్య రాజకీయ నేతల విద్వేష ట్వీట్ల తొలగింపు విషయంలో సర్వత్రా విమర్శల పాలవుతున్న ఫేస్‌బుక్‌ తాజాగా ఓ వింత నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌ పేజీల్లో విద్వేషపూరిత, రెచ్చగొట్టే, కించపరిచే సమాచారాన్ని ఆటోమేటిగ్గా తొలగించేందుకు ఏర్పాటు చేసిన ఆల్గారిథమ్‌ ఓ ఉల్లిపాయ ఫొటోను తొలగించింది. ఫేస్‌బుక్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. విక్రేత కూడా దీనిపై ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేశారు. చివరికి సోషల్‌ మీడియా దిగ్గజం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

 సెక్సీగా ఉందని ఉల్లిపాయ ఫొటో తొలగించిన ఫేస్‌బుక్..

సెక్సీగా ఉందని ఉల్లిపాయ ఫొటో తొలగించిన ఫేస్‌బుక్..

కెనడాకు చెందిన ఓ విత్తనాల విక్రేత తన ఫేస్‌బుక్‌ పేజీలో ప్రీమియం ఉల్లిపాయల ఫొటో ఉంచాడు. ఈడబ్ల్యూ గేజ్‌ అనే ఈ విక్రేత ద సీడ్‌ కంపెనీ అనే తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో ఎర్రగా ఊరించేలా ఉన్న ప్రీమియం ఉల్లిపాయల్ని అమ్మకానికి ఉంచాడు. దీన్ని చూసిన కొందరు అతన్ని సంప్రదించి కొనుగోలు చేశారు కూడా. కానీ కాసేపటికే ఆ ఫొటోను ఫేస్‌బుక్‌ తొలగించింది. దీనిపై గేజ్‌ ఫేస్‌బుక్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించాడు. కానీ అంతలోనే ఫేస్‌బుక్‌ నుంచి ఓ సందేశం వచ్చింది. అతను పెట్టిన ఉల్లిగడ్డల ఫొటో బహిరంగంగా సెక్స్‌ను ప్రేరేపించేలా ఉందని, సంస్ద విధానాలకు వ్యతిరేకంగా ఉందని అందులో ఉంది. దీన్ని చూసి అతడు షాకయ్యాడు.

 విమర్శలతో వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్‌..

విమర్శలతో వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్‌..

ఫేస్‌బుక్‌ నుంచి వచ్చిన ఈ మెసేజ్ చూసిన ఉల్లిపాయల విక్రేతలైన షాపు యజమానులు దీని స్క్రీన్‌షాట్‌ తీసి ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌ దీనిపై స్పందించేలోపే ఈ స్క్రీన్‌షాట్‌ సైతం వైరల్‌ అయిపోయింది. కెనడాలోని మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా కూడా దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కథనాలు ప్రసారం చేస్తోంది. కమెడియన్‌ ట్రెవర్‌ నోహ్‌ నిర్వహించే ద డెయిలీ షోలోనూ దీనిపైనే చర్చ సాగింది. అంతర్జాతీయంగా దీనిపై చర్చ సాగడంతో ఫేస్‌బుక్‌ దీనిపై స్పందించింది. ఉల్లిపాయల ఫొటో తొలగించాలన్న తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు విక్రేత గేజ్‌కూ క్షమాపణ చెప్పింది.

Recommended Video

Facebook, Twitter, Instagram లో పర్సనల్స్ , ఫొటోస్ పెట్టడం ఎంత ప్రమాదమో తెలుసా ? | Sandeep Mudalkar
 పొరబాట్లు సహజమేనంటున్న టెకీలు..

పొరబాట్లు సహజమేనంటున్న టెకీలు..

ఫేస్‌బుక్‌ తాజా నిర్ణయంపై స్పందించిన కెనడియన్‌ వల్లావల్లా ఉల్లిపాయ విక్రేతలు ఆల్గారిథమ్‌ పొరబాట్ల వల్ల ఇలా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఉల్లిపాయ ఆకారం వల్ల ఫేస్‌బుక్‌ ఆల్గారిథమ్‌ తప్పుగా అర్దం చేసుకుని ఇలా తొలగించి ఉండొచ్చని, మొత్తం మీద ఫేస్‌బుక్ క్షమాపణ చెప్పింది కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో నగ్నత్వం, ఆశ్లీల ఫొటోలను నియంత్రించేందుకు ఇలాంటి ఆల్గారిథమ్‌ ఏర్పాటు చేశారని, కొన్నిసార్లు పొరబాట్లు సహజమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
In a bizarre incident, the social media platform Facebook's algorithm recently got hoodwinked by a photo onions which it claimed was "overtly sexual".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X