• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రంప్‌కు షాకిచ్చిన ఫేస్‌బుక్: ఒక్క క్లిక్‌తో అలాంటి యాడ్స్‌పై వేటు: నాజీల సింబల్‌తో

|

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి షాక్ ఇచ్చింది ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్. డొనాల్డ్ ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌లకు సంబంధించిన కొన్ని వివాదాస్పదమైన ప్రకటనలను తొలగించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అలాంటి యాడ్స్‌పై వేటు వేసింది. ఆయా అడ్వర్టయిజ్‌మెంట్లన్నీ తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున వాటిని తొలగించాల్సి వచ్చిందని వివరించింది. మొత్తం 17 వేల అమెరికన్ డాలర్ల విలువ చేసే వాణిజ్య ప్రకటనలను ఒక్క క్లిక్‌తో వాటన్నింటినీ రిమూవ్ చేసింది.

జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ హయాంలో యుద్ధ ఖైదీలు, కమ్యూనిస్టులు, తిరుగుబాటుదారులపై వినియోగించే రెడ్ ట్రయాంగిల్ సింబల్‌ను తలకిందులుగా ప్రదర్శిస్తూ అమెరికా ప్రభుత్వం కొన్ని వాణిజ్య ప్రకటనలను రూపొందించింది. వాటిని ప్రమోట్ చేయడానికి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఫేస్‌బుక్‌లో పబ్లిస్ అయిన తరువాత వాటిని పునఃసమీక్షించింది యాజమాన్యం. అభ్యంతరకరమైన యాడ్స్‌ను తొలగించడానికి అంతర్గతంగా ఏర్పాటు చేసుకున్న ఫేస్‌బుక్ ఎగ్జిక్యూటివ్ హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ..వాటిని పరిగణనలోకి తీసుకుంది.

Facebook removes Trump ads with symbols once Nazis Symbolism for Hate-Speech Violations

నిబంధనలకు విరుద్దంగా ఉండటం వల్ల వాటిని తొలగించినట్లు ప్రకటించింది. ఈ యాడ్స్ విలువ మొత్తం 17 వేల అమెరికన్ డాలర్లు. త్వరలో అమెరికా అధ్యక్షుడి ఎన్నికలను నిర్వహించబోతోన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రూపొందించిన అడ్వర్టయిజ్‌‌మెంట్లు వివాదాస్పదం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిట్లర్‌ను గుర్తుకు తెచ్చేలా, ఆయన హయాంలో వినియోగించిన రెడ్ ట్రయాంగిల్ గుర్తును తలకిందులుగా ప్రదర్శించడాన్ని హేట్ స్పీచ్ నిబంధనలను ఉల్లంఘించినటట్లుగా పరిగణిస్తున్నామని ఫేస్‌బుక్ సెక్యూరిటీ విధానాల చీఫ్ నథానియల్ వెల్లడించారు.

ఇదివరకు ఫేస్‌బుక్ యాజమాన్యం అమెరికా అధ్యక్షుడికి మద్దతు పలుకుతోందనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం అనంతరం అమెరికాలో చోటు చేసుకున్న దాడులు, ఉద్రిక్త పరిస్థితులు, అరెస్టుల పర్వంలో ఆందోళనకారులకు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, వార్తా కథనాలను ఫేస్‌బుక్ ప్రమోట్ చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ విధానాలను తప్పుపడుతూ కొందరు ఉద్యోగులు సైతం తమ అసంతృప్తిని, అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు.

English summary
Facebook has removed campaign ads by President Donald Trump and Vice President Mike Pence that featured an upside-down red triangle, a symbol once used by Nazis to designate political prisoners, communists and others in concentration camps.The company said in a statement Thursday that the ads violated “our policy against organized hate.” A Facebook executive who testified at a House Intelligence Committee hearing on Thursday said the company does not permit symbols of hateful ideology “unless they’re put up with context or condemnation.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X