వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జుకర్ బర్గ్ స్థానంలో స్వతంత్ర బోర్డు చైర్ పర్సన్!?: షేర్ హోల్డర్స్ పిటిషన్

స్వతంత్ర చైర్ పర్సన్ కోసం పిటిషన్ దాఖలు చేసినవాళ్లలో దాదాపు 1500మందికి ఫేస్ బుక్ షేర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ స్థానంలో స్వతంత్ర బోర్డు చైర్ పర్సన్‌ను నియమించాలని కొంతమంది షేర్ హోల్డర్స్ పిటిషన్ ప్రవేశపెట్టారు. కంపెనీ చైర్మన్, సీఈవో బాధ్యతలు రెండు జుకర్ చేతిలోనే ఉండటంతో.. ఆయన నిర్ణాయధికారాన్ని నియంత్రించలేకపోతున్నామని వారు వాపోతున్నారు.

వాటాదారుల ప్రయోజనాలను మరింత ఉన్నంత స్థితికి చేర్చేందుకు, జవాబుదారీతనంలో మరింత కచ్చితత్వం కోసం ఈ మార్పు జరగాలని వినియోగదారుల పక్షం తరుపున డిమాండ్ వినిపిస్తోంది.

వినియోగదారుల తరుపున వాచ్ డాగ్‌గా వ్యవహరిస్తున్న SumOfUs.org వెబ్‌సైట్ సభ్యులు ఈ పిటిషన్ ప్రవేశపెట్టారు. అధికారిక వ్యవహారాలను పర్యవేక్షించగల సామర్థ్యంతో పాటు, కార్పోరేట్ పాలనను మరింత మెరుగుపరచగలిగేలా కొత్త బాస్ ఉండాలని పిటిషన్‌లో పొందుపరిచారు.

Facebook shareholders urge company to replace Mark Zuckerberg with ‘independent’ board chair

కంపెనీకి మరింత మెరుగైన భవిష్యత్తుతో పాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు సమన్వయం కుదిరేందుకు కొత్త బాస్ నియామకం తోడ్పడుతుందని వారు ఆకాంక్షించారు. ఇప్పటికే పలు కార్పోరేట్ కంపెనీలను ప్రభావితం చేసిన సమ్ఆఫ్అజ్ సంస్థ.. జుకర్ బర్గ్ అధికారాలను పరిమితం చేయడం కోసం ఫేస్ బుక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ను పక్కనబెట్టి స్వతంత్ర చైర్ పర్సన్ ను ఏర్పాటు చేయాలని కోరుతోంది.

స్వతంత్ర చైర్ పర్సన్ కోసం పిటిషన్ దాఖలు చేసినవాళ్లలో దాదాపు 1500మందికి ఫేస్ బుక్ షేర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. గతేడాది కొత్తగా నాన్ ఓటింగ్ క్లాస్ సీ స్టాక్‌లను విడుదల చేసినప్పటి నుంచి షేర్ హోల్డర్స్ ఒకింత గుర్రుగానే ఉన్నారు. దీని ప్రకారం ప్రతీ ఫేస్ బుక్ స్టాక్ హోల్డర్ కు ఒక్కో ఎగ్జిస్టింగ్ కు రెండు స్టాక్ లు లభిస్తాయి.

కాగా, షేర్ హోల్డర్స్ ప్రవేశపెట్టిన ఈ పిటిషన్ కు ఇప్పటికే 3.33లక్షల మంది నుంచి సంతకాలు సేకరించినట్టు వెంచర్ బీట్ తమ నివేదికలో పేర్కొంది.

English summary
Facebook is being pressured by a group of shareholders seeking the removal of company chief executive Mark Zuckerberg from the board of the directors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X