వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌కి షాకిచ్చిన ‘ఏఐ’: బెంబేలెత్తిన పరిశోధకులు, నాశనం చేశారు

ఫేస్‌బుక్ అభివృద్ధి చేసింది కృత్రిమ మేధస్సు చాట్‌బోట్స్(ఇంటర్నెట్ ద్వారా మనుషులతో మాట్లాడటానికి ఉపయోగించే ఒక కంప్యూటర్ ప్రోగ్రాం).కాగా, ఇవి ఫేస్‌బుక్ ఉద్యోగులు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించాయి.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: కృత్రిమ మేధస్సు చాలా ప్రమాదకరమైన విషయమని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చెప్పిన మరుసటి రోజే.. ఫేస్‌బుక్ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్-ఏఐ) సిస్టంను రద్దు చేసుకుంది. దీనికి ఒక బలమైన కారణం కూడా ఉంది.

వివరాల్లోకి వెళితే.. కృత్రిమ మేధస్సుతో రూపుదిద్దుకున్న చాట్‌బోట్స్(ఇంటర్నెట్ ద్వారా మనుషులతో మాట్లాడటానికి ఉపయోగించే ఒక కంప్యూటర్ ప్రోగ్రాం).. ఫేస్‌బుక్ ఉద్యోగులు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించాయి. అంతేగాక, అవి సొంతంగా అభివృద్ధి చేసుకున్న భాషలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవడం ప్రారంభించాయి. దీంతో ఫేస్ బుక్ ఉద్యోగులు అవాక్కయ్యారు.

Facebook shuts AI system after bots speak their own language, defy human instructions

ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక చాట్ బోట్స్(ఏఐ)ను వెంటనే నిలిపేసింది ఫేస్‌బుక్. ఈ మేరకు ఓ అంతర్జాతీయ పత్రిక ఆదివారం ప్రచురించిన తన కథనంలో పేర్కొంది. ఏఐ చాట్‌బోట్స్ ఫేస్‌బుక్ పరిశోధకుల మాట వినకుండా వాటి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినట్లు తెలిపింది. దీంతో విస్మయానికి గురైన పరిశోధకులు వెంటనే ఆ ఏఐని నిర్వీర్యం చేశారని పేర్కొంది.

అయితే, చాట్‌బోట్స్ ఫేస్‌బుక్ కార్యాలయంలోని కంప్యూటర్లకు ఎలాంటి హాని తలపెట్టలేదని వెల్లడించింది. ఫేస్‌బుక్ పరిశోధకులు డీపాల్ట్‌గా ఇచ్చిన ఇంగ్లీష్ భాషను వదిలేసి తన సొంతంగా అభివృద్ధి చేసుకున్న మరొక భాషలో ఆ ఏఐ సంభాషించడం మొదలుపెట్టినట్లు వివరించింది.

English summary
Days after Tesla CEO Elon Musk said that artificial intelligence (AI) was the biggest risk, Facebook has shut down one of its AI systems after chatbots started speaking in their own language defying the codes provided.
Read in English: FB shuts down AI system
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X