వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌ను తాకిన సెగ:జుకర్‌బర్గ్‌పై ఉద్యోగుల తిరుగుబాటు: మార్క్..ఉక్కిరిబిక్కిరి: ట్రంప్ పై

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా చెలరేగుతోన్న ఘర్షణల సెగ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు తాకింది. ఫేస్‌బుక్ ఉద్యోగులు కొందరు తమ సంస్థ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి మార్క్ జుకర్‌బర్గ్‌పై ఏకంగా తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి కారణమైంది. అనూహ్యంగా చోటు చేసుకుంటోన్న ఈ పరిణామాలతో జుకర్‌బర్క్ ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మిన్నంటిన నిరసనలు..

మిన్నంటిన నిరసనలు..

ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం అనంతరం అమెరికాలో పెద్ద ఎత్తున జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మూడు రోజుల కిందట మిన్నేపొలీస్‌లో ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శనలు ప్రస్తుతం అమెరికా మొత్తానికీ వ్యాపించాయి. రాజధాని వాషింగ్టన్‌ వరకూ పాకాయి. నిరసన కారుల ప్రదర్శనల వల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా అండర్‌గ్రౌండ్ బంకర్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితిని కల్పించాయి.

అండర్‌గ్రౌండ్‌లో ట్రంప్: రక్షణ కోసం బంకర్‌లో: మెలానియా సహా: ఆంటిఫాపై ఉగ్రముద్ర: అనూహ్యంగాఅండర్‌గ్రౌండ్‌లో ట్రంప్: రక్షణ కోసం బంకర్‌లో: మెలానియా సహా: ఆంటిఫాపై ఉగ్రముద్ర: అనూహ్యంగా

ఫేస్‌బుక్‌ను తాకిన నిరసనలు..

తాజాగా- ఈ నిరసన ప్రదర్శనల సెగ ఫేస్‌బుక్‌లో సెగలు రేపింది. కాలిఫోర్నియా మెన్‌లో పార్క్‌లో గల ఫేస్‌బుక్ కార్యాలయంలో పని చేస్తోన్న కొందరు ఉద్యోగులు మార్క్ జుకర్‌బర్గ్‌పై తిరుగుబాటు లేవనెత్తారు. జాత్యహంకారానికి వ్యతిరేకంగా చెలరేగుతోన్న ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న వివాదాస్పద వ్యాఖ్యలను నియంత్రించడానికి ఫేస్‌బుక్ యాజమాన్యం ఎలాంటి చర్యలను తీసుకోకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మార్క్ జుకర్‌బర్గ్‌ను నిలదీస్తున్నారు కూడా.

ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలను నియంత్రించాలంటూ..

ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలను నియంత్రించాలంటూ..

జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికా వ్యాప్తంగా ఆందోళలనలను చేపట్టిన నల్లజాతీయులకు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న వ్యాఖ్యలను నియంత్రించాలనేది ఫేస్‌బుక్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ప్రదర్శనకారులను రెచ్చగొట్టేలా డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న వ్యాఖ్యలను ఫేస్‌బుక్ ద్వారా ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తితే.. అది మరిన్ని దాడులకు ప్రేరేపించడానికి కారణమౌతుందని ఫేస్‌బుక్ ప్రొడక్ట్ డిజైన్ డైరెక్టర్ డేవిడ్ గిల్లీస్ అన్నారు.

ప్రతి ఉద్యోగీ ఇదే కోరుకుంటున్నాడంటూ..

ప్రతి ఉద్యోగీ ఇదే కోరుకుంటున్నాడంటూ..

ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలపై ట్విట్టర్ తీసుకున్న చర్యలను చేపట్టాలని తాను మాత్రమే కాదని, ప్రతి ఉద్యోగి కూడా కోరుకుంటున్నారని ఫేస్‌బుక్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ జేసన్ టఫ్ తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలను నియంత్రించడానికి తక్షణ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయని, ట్రంప్ చేసే వివాదాస్పద వ్యాఖ్యలను నియంత్రించకపోతే అవి మరింతపెచ్చరిల్లుతాయనీ జేసన్ అభిప్రాయపడ్డారు.

English summary
Facebook employees have spoken out in anger after CEO Mark Zuckerberg said he planned to take no enforcement action against a post by President Donald Trump following the killing of George Floyd. The staffers said the post has no place on Facebook, adding that they’re “disappointed” and “gravely concerned” it has not been removed. At least six Facebook employees took to Twitter to condemn Zuckerberg’s decision, with comments like “Mark is wrong” and “doing nothing is unacceptable.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X