వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10వేల యాప్స్ తొలగించిన ఫేస్‌బుక్: ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తమ నెట్‌వర్క్ పరిధిలోని ప్రమాదకరమైన 10వేల యాప్స్‌ను తొలగించినట్లు వెల్లడించింది.
వినియోగదారుల అంతర్గత భద్రతకు ప్రమాదకారులు కానప్పటికీ.. వీటిలో చాలా వరకు పరీక్షల దశలోనే ఉన్నాయి.

వినియోగదారులకు పూర్తిగా అందుబాటులోకి రాని కారణంగా 400 మంది యాప్ డెవలపర్స్‌కు చెందిన 10వేల యాప్స్‌ను తొలగించినట్లు ఫేస్‌బుక్ వివరించింది. కంపెనీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. ఫేస్‌బుక్ నుంచి సేకరించిన వినియోగదారుల వివరాలను బహిర్గతం చేసిన యాప్స్‌ను పూర్తిగా తొలగించామని తెలిపింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.

FACEBOOK SUSPENDED 10 THOUSAND OF APPS

వినియోగదారులకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ ఫేస్ ని కూడా తొలగించినట్లు తెలిపింది. గత ఏడాది మార్చిలో కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం సందర్భంగా దర్యాప్తు చేపట్టి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

కేంబ్రిడ్జ్ అనలిటికా కేసులో ఫెడరల్ ట్రేడ్ కమిషన్.. ఏడాది తొలినాళ్లలో ఫేస్‌బుక్‌కు 5 బిలియన్ డాలర్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ వినియోగదారుల అంతర్గత భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అలాగే తప్పుడు వార్తల ప్రచారాన్ని అడ్డుకునేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది.

English summary
Recently facebook has deleted ten thousand of applications of hundred developers. Because of Cambridge Analytica scandals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X