• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అతిపెద్ద కుదుపు?: ట్రంప్ గెలుపుకు ఫేస్‌బుక్‌తో లింకు?, అసలేం జరిగింది?

|
  Facebook, Cambridge Analytica 'data breach': All You Need To Know

  న్యూయార్క్: ప్రపంచ దశా దిశను శాసిస్తున్న ఫేస్‌బుక్‌ను దాని యాజమాన్యం దుర్వినియోగం చేస్తోందా?.. కొందరి ప్రయోజనాల కోసం డేటాను లీక్ చేస్తోందా?.. ఇప్పుడివే ప్రశ్నలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై 'డేటా లీక్' ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  అసలేం జరిగింది:

  అసలేం జరిగింది:

  ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది యూజర్లను కలిగిన ఫేస్‌బుక్.. దాదాపు 5 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను లీక్‌ చేసిందనేది ప్రధాన ఆరోపణ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి ఈ డేటా పరోక్షంగా సహకరించిందనేది మరో ఆరోపణ.

  ఈ ఆరోపణలతో ఫేస్‌బుక్ మార్కెట్ భారీగా పతనమైంది. ఫేస్‌బుక్ షేర్స్ 7శాతానికి పడిపోగా.. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ కేవలం మూడురోజుల్లో తన నికర సంపదలో దాదాపు 500 కోట్ల డాలర్లు నష్టపోయారు.

  నిబంధనలు ఒప్పుకోకపోయినా..:

  నిబంధనలు ఒప్పుకోకపోయినా..:

  కేంబ్రిడ్జ్‌లో సైకాలజీలో ప్రొఫెసర్‌ అయిన డాక్టర్‌ అలెగ్జాండర్‌ కోగన్‌, డేటా అనలిస్ట్ నిపుణుడు క్రిస్టొఫర్‌ వైలీలు ఈ డేటా లీకేజీకి తెరలేపినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

  డా.అలెగ్జాండర్ కోగన్.. తన పరిశోధనల కోసం అని నమ్మబలికి ఫేస్‌బుక్ నుంచి కొన్ని వేలమంది వ్యక్తిగత డేటా సేకరించాడు. నిజానికి వ్యక్తిగత డేటా పొందడానికి ఫేస్‌బుక్‌ నిబంధనలు ఒప్పుకోవు.

  ట్రంప్ క్యాంపెయిన్‌కు ఉపయోగపడేలా..:

  ట్రంప్ క్యాంపెయిన్‌కు ఉపయోగపడేలా..:

  తన లక్ష్యం మనిషి సైకాలజీని డిజిటల్ కోణం నుంచి చూడటం మాత్రమేనని చెప్పి అలెగ్జాండర్‌ కోగన్‌ నమ్మించాడు. ఫేస్ బుక్ సైతం దీన్ని అంత సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే.. వేలమంది నుంచి అతను వ్యక్తిగత డేటా సేకరించినట్టు చెబుతున్నారు.

  గత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్‌కు సహకరించిన స్టీవ్ బానన్.. తన సన్నిహితుడైన డేటా అనలిస్ట్ ఎక్స్‌పర్ట్ కలిసి అలెగ్జాండర్ కోనన్ నుంచి ఫేస్ బుక్ యూజర్ల డేటా సేకరించినట్టు చెబుతున్నారు.

  బయటపెట్టింది వైలీనే:

  బయటపెట్టింది వైలీనే:

  క్రిస్టఫర్ వైలీ చేసిన ప్రతిపాదన మేరకే స్టీవ్ బానన్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల డేటాను సేకరించడానికి మొగ్గుచూపాడని అంటున్నారు. అయితే ఇందుకోసం మొదట కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థను స్థాపించి దాని ద్వారా ఆపరేషన్ కొనసాగించాలని భావించారు.

  దీనిపై స్పందించిన వైలీ..'నిజానికి ఇలా చేసేందుకు నా మనస్సాక్షి ఒప్పుకోలేదు... మనస్ఫూర్తిగా ఆ పని చేయలేకపోయాను' అని వెల్లడించారు. అయితే అలెగ్జాండర్ కోగన్ ను సంప్రదించి డేటా సేకరించినట్టు చెప్పారు. ఈ విషయాన్ని తొలుత బయటపెట్టింది కూడా ఆయనే కావడం గమనార్హం.

  ఫేస్‌బుక్ వాదన:

  ఫేస్‌బుక్ వాదన:

  మరోవైపు ఫేస్‌బుక్‌ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఇది కుంభకోణ: కాదని, కేవలం డేటా బ్రీచ్(ఉల్లంఘన) మాత్రమేనని చెబుతోంది. వైలీ ఫేస్‌బుక్‌ ఖాతాలను ఇప్పటికే స్తంభింపజేసినట్టు వెల్లడించింది. అయితే కోగన్-వైలీల కార్యకలాపాల గురించి తెలిసి కూడా ఫేస్‌బుక్‌ యాజమాన్యం చూసీ చూడనట్టు వదిలేసిందని, ఆ అలసత్వం వల్లే భారీ ఎత్తున డేటా లీకైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  విచారణ:

  ఫేస్‌బుక్‌పై ఆరోపణల నేపథ్యంలో 'కెనడా ప్రైవసీ వాచ్ డాగ్' దీనిపై విచారణ జరిపేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన కెనడా ప్రైవసీ కమిషనర్ డేనియల్ 'ఫేస్‌బుక్‌పై మేము ఫిర్యాదులు అందుకున్నాం.

  కేంబ్రిడ్జి అనలిటికా సంస్థకు ఫేస్‌బుక్‌ డేటా లీక్ చేసిందన్న ఆరోపణలపై విచారణ ప్రారంభించాం.' అని తెలిపారు. ఇందులో భాగంగా.. కెనడాలోని ఫేస్‌బుక్‌ యూజర్ల వ్యక్తిగత డేటా లీకైందా? అన్న అంశంపై తొలుత విచారణ చేయనున్నట్టు తెలిపారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The world's-largest social media company Facebook suffered the biggest one-day drop of its stocks by seven per cent on Wall Street late on Monday in four years following reported data leakage of its 50 million users for alleged political purposes, said a report by news agency Indo-Asian News Service (IANS) report.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more