వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోగో మార్పు చేసిన ఫేస్‌బుక్: ఎందుకో తెలుసా?

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన లోగోను మార్చివేసింది. తన అనుబంధ కంపెనీలు జతచేరిన అనంతరం జరిగిన మార్పును సూచిస్తూ ఈ లోగోను రూపొందించింది. ఫేస్‌బుక్ అనే వర్ణమాలను క్యాపిటల్ అక్షరాలుగా చేసి, కొత్త ఫాంట్‌లోకి మార్చారు.

నీలం, ఆకుపచ్చతోపాటు వంగపండు రంగు, ఎరుపు, నారింజ రంగులతో కలిపిన రంగులతో కొత్త లోగో తీసుకొచ్చింది. తద్వారా ఇతర బ్రాండ్లనూ లోగోలో కనిపించేలా చేశారు. నీలం-ఫేస్‌బుక్, ఆకుపచ్చ-వాట్సప్, వంగపండు, ఎరుపు, నారింజ-ఇన్‌స్టా‌గ్రామ్‌లను సూచిస్తాయి.

తనకు చెందిన యాప్స్‌ల విషయంలో వినియోగదారులకు మరింత స్పష్టతనిచ్చేలా ఈ లోగోను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లు ఫేస్‌బుక్‌కు చెందినవని కేవలం 29 శాతం మంది అమెరికన్లకు మాత్రమే తెలుసని ఓ సర్వేలో తేలింది. అందుకే ప్రజలకు తమ కంపెనీ అందిస్తున్న ఉత్పత్తుల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందన ఒక బ్లాగ్ పోస్టులో ఫేస్‌బుక్ పేర్కొంది.

Facebook wants you to know it makes Instagram and WhatsApp, so its changing the Fb logo to make that clear

రాబోయే కొద్ది వారాల్లో ఫేస్‌బుక్ కొత్త బ్రాండ్.. ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లలో కనిపించనుంది. కాగా, తన ప్రధాన వెబ్‌సైట్, యాప్‌లకు సంబంధించి గతంలో ఉన్న నీలి రంగు బ్రాండింగ్‌నే ఫేస్‌బుక్ కొనసాగిస్తోంది.

వినియోగదారులు వారు ఉపయోగించే ఉత్పత్తులను ఏ కంపెనీలు తయారు చేశాయో తెలుసుకోవాలని.. ఫేస్‌బుక్‌లో భాగమైన ఉత్పత్తులు, సేవల గురించి చాలా కాలం నుంచి ప్రజలకు స్పష్టంగా చెబుతున్నామని ఫేస్‌బుక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆంటోనియో లూసియో తెలిపారు.

ఇదిఇలావుంటే.. దొంగ ఖాతాలను అరికట్టేందుకు ఫేస్‌బుక్ రహస్యంగా ఓ తనిఖీ కార్యక్రామాన్ని ఇటీవల చేపట్టినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఫేస్‌బుక్ ఖాతాదారుల ముఖాన్ని సెల్ఫీ వీడియో తీసి పంపించుకుంటే.. ఆ వీడియో ద్వారా 'మీరు మీరేనా? కాదా?' అన్న విషయాన్ని ఫేస్‌బుక్ ధృవీకరించుకుంటుంది.

కంటి ముందు వరకు మొబైల్‌ను ఎత్తిపట్టుకుని కెమెరా స్ర్కీన్ మీద కనిపించే వృత్తంలో ముఖం పూర్తిగా వచ్చేలా సెట్ చేసుకోవాలి. స్క్రీన్ మీదకు సూటిగా చూస్తూ.. అక్కడ్నుంచి కుడికి, మళ్లీ పూర్తి ఎడమకి తలను తిప్పి మళ్లీ ముఖాన్ని సూటిగా తీసుకురావాలి. దీన్ని సెల్ఫీ తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ వీడియోను ఎవరికి చూపించమని కూడా కంపెనీ వర్గాలు హామీ ఇస్తున్నాయి. మీరు మీరేనా అనే విషయాన్ని రుజువు చేసుకుని నెల రోజుల్లో వీడియోను డిలీట్ చేస్తామని కూడా పేర్కొంది.

English summary
There's Facebook, the social media network used by billions of people around the world, and then there's Facebook, the corporate parent of several major social media and tech organizations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X