వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది ఆధునిక నియంత భౌతిక కాయమేనా?: ఉత్తర కొరియా ఏం చెబుతోంది?

|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్: ఆధునిక నియంతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కిమ్‌జొంగ్ ఉన్ కొద్దిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా అయ్యారు. కరోనా వైరస్ కలవరపెడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ విదేశీ మీడియా ఆయనపైనే ఫోకస్ పెట్టింది. దీనికి కారణాలు లేకపోలేదు. రెండువారాలుగా ఆయన మీడియా ముందుకు రాకపోవడమే దీనికి కారణం. అంతకుముందే ఆయన గుండెకు సర్జరీ చేయించుకున్నారనే వార్తలు వెల్లువెత్తాయి.

ఆ సర్జరీ కాస్త వికటించడం వల్ల కిమ్‌జొంగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఒకసారి, కోమాలోకి వెళ్లారని మరోసారి.. మరణించారంటూ ఇంకోసారి ఇలా వార్తలు విదేశీ మీడియాలో గుప్పుమన్నాయి. ఈ వార్తలు, వదంతులకు పతాకస్థాయి అన్నట్టుగా భౌతికకాయం ఫొటో ఒకటి విదేశీ మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. కిమ్‌జొంగ్ అనారోగ్యానికి గురై మరణించారని, ఆ విషయాన్ని ఉత్తర కొరియా దాచి పెడుతోందనే వదంతులు కూడా కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాప్తి చెందాయి.

Fact check: Is that Kim Jong Un lying dead in a coffin, North Korea denied

ఈ అనుమానాలన్నింటికీ ఉత్తర కొరియా ప్రభుత్వం తెరదించింది. అది కిమ్‌జొంగ్ భౌతిక కాయం కాదని స్పష్టం చేసింది. కిమ్ తండ్రి భౌతిక కాయమని వెల్లడించింది. కిమ్ తండ్రి కిమ్‌జొంగ్ ఇల్.. 2011లో గుండెపోటుకు గురై కన్నుమూశారు. అప్పటి మృతదేహాన్ని కిమ్ జొంగ్ ఉన్‌కు చెందినదిగా మీడియాలో వార్తలు వస్తున్నాయని, అవి సరైనవి కాదంటూ క్లారిటీ ఇచ్చింది ఉత్తర కొరియా.

Recommended Video

Kim Jong Un : Kim Jong Un Is In Exile Due To Coronavirus - South Korea

జపాన్‌కు చెందిన న్యూస్ నెట్‌వర్క్ జెఎన్ఎన్, హాంగ్‌కాంగ్ శాటిలైట్ టీవీ ఈ ఫొటోను ప్రచారంలోకి తీసుకొచ్చాయి. కిమ్ తండ్రి భౌతిక కాయానికి సంబంధించిన ఈ ఫొటో తొలిసారిగా 2017లో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. అప్పటి ఫొటోను కిమ్ జొంగ్‌దేననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం కిమ్.. రాజధాని ప్యాంగ్యాంగ్‌లో లేరని పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఓ రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని స్పష్టం చేసింది. ఆయన క్షేమంగా ఉన్నారని పునరుద్ఘాటించింది.

English summary
With absolutely no clarity on North Korean leader, Kim Jong Un, rumours have sparked off about his whereabouts and health. There is a viral image that claims to show Kim Jong lying in a coffin. The image is a doctored one. The funeral is that of his father, Kim Jong II, who died in 2011 from a heart attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X