వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ సినిమాలో చూపించిందే నిజమైంది.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై అప్పట్లోనే సినిమా..

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రమాదాన్ని ఓ సినిమా ముందే ఊహించింది. 2011లో వార్నర్‌ బ్రదర్స్‌ నిర్మాణంలో కేట్ విన్‌స్లెట్,మట్ డామన్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన మెడికల్ డిజాస్టర్ థ్రిల్లర్ 'కంటేజియన్' చిత్రం కరోనా వైరస్ పరిణామాలను కళ్లకు కట్టినట్టు చూపించింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ వల్ల మిలియన్ల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతుంటారు. ఈ వైరస్ నివారణకు ఆయా దేశాల రోగ నిరోధక కేంద్రాలు తీవ్రంగా కృషి చేస్తాయి. ఓ ఫిక్షన్ వైరస్ సబ్జెక్టుతో కంటేజియస్ సినిమాను తెరకెక్కించగా.. ఇప్పుడవే పరిణామాలు కరోనా వైరస్ రూపంలో నిజంగా చోటు చేసుకుండటం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

కంటేజియన్ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో..

కంటేజియన్ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో..


కంటేజియన్ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో ఓ ఫిక్షనల్ వైరస్ పుట్టుకొస్తుంది. చైనాలోని ఓ గబ్బిలం నుంచి పుట్టుకొచ్చిన ఈ వైరస్.. ఆ తర్వాత ఒక పందికి వ్యాప్తి చెందుతుంది. ఆపై ఆ పంది మాంసాన్ని వండిన చెఫ్‌కు ఆ వైరస్ సోకుతుంది. అతని నుంచి గ్వినేత్ పాల్ట్రో అనే పాత్రధారికి వైరస్ వ్యాపిస్తుంది. గ్వినేత్‌ను 'పేషెంట్ జీరో'గా వ్యవహరిస్తారు. పేషెంట్ జీరో అంటే.. ఏదైనా డిసీజ్‌ మొట్టమొదటిసారిగా ఎవరిలోనైతే బయటపడుతుందో వారిని ఆ పేరుతో వ్యవహరిస్తారు.ఆ సినిమాలో చూపించినట్టుగానే ఇప్పుడు నిజ జీవితంలోనూ కరోనా అనే వైరస్ చైనాలోనే ఓ గబ్బిలం నుంచి పుట్టుకొచ్చింది. వుహాన్ అనే పట్టణం నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందినట్టుగా భావిస్తున్నారు.

దర్శకుడికి అభినందనలు..

దర్శకుడికి అభినందనలు..


సినీ చరిత్రలోనే కంటేజియన్ సినిమా అత్యంత భయానకమైనదని, కొన్నేళ్లుగా ఇదే విషయాన్ని తాను చెబుతున్నానని దర్శకుడు స్టీఫెన్ ఫోర్డ్ అన్నారు. ఇప్పుడదే విషయం నిజమైందన్నారు. ఆ సినిమాలో గబ్బిలం విసర్జితం నుంచి వైరస్ వ్యాప్తి చెందినట్టుగా చూపిస్తారు. ఇప్పుడు నిజంగా గబ్బిలం నుంచే వైరస్ వ్యాప్తి చెందినట్టు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంతటి మెడికల్ విపత్కర పరిస్థితిని ముందుగానే ఊహించి తెరకెక్కించిన దర్శకుడు స్టీఫెన్‌ను సైంటిస్టులు అభినందిస్తున్నారు.

ఎక్కడినుంచి వ్యాప్తి..

ఎక్కడినుంచి వ్యాప్తి..

వుహాన్ అనే పట్టణంలో ఉన్న ఓ 'సీ ఫుడ్ మార్కెట్' నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. మరికొందరు గబ్బిలం జిగరుతో తయారుచేస్తున్న సబ్బులతోనే ఈ వైరస్ పుట్టుకొచ్చిందని అంటున్నారు. గబ్బిలం విసర్జితాలను పంట పొలాల్లో ఎరువుల్లా వాడుతుండటం కూడా కరోనా వ్యాప్తికి కారణమేమోనని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కరోనాతో చైనాలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. వైరస్ సోకినవారు ఎక్కడికక్కడే పడిపోతున్నారు. ఇప్పటివరకు 26 మంది మృతి చెందగా.. 800 పైచిలుకు ఆస్పత్రిపాలయ్యారు.

కరోనా ప్రభావం..

కరోనా ప్రభావం..

ఇక సౌదీ అరేబియాలోని అల్‌హసన్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న భారతీయ మహిళకు కూడా కరోనా వైరస్ సోకినట్టుగా వార్తలు వచ్చినప్పటికీ.. వైద్య పరీక్షల్లో అలాంటిదేమీ బయటపడలేదని వైద్యులు నిర్దారించారు. ఇటీవలే చైనా నుంచి ముంబైకి తిరిగొచ్చిన ఇద్దరు వ్యక్తులను కూడా ప్రస్తుతం మెడికల్ అబ్జర్వేషన్‌లో పెట్టారు.మెడికల్ నిపుణులు అంచనా వేస్తున్న దానికంటే తీవ్ర స్థాయిలో కరోనా ప్రభావం ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Fans of the 2011 movie Contagion have pointed out the film's eerie parallels with the ongoing deadly outbreak of coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X