వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెచ్చిపోయిన రైతు ఉద్యమ మద్దతుదారులు: మహాత్ముడి విగ్రహం ధ్వంసం: ఖలిస్తాన్ జెండాలతో

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా రైతులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. రెండు వారాలుగా రైతన్నల పోరాటం కొనసాగుతోంది. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో రైతుల ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అదే క్రమంలో- విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు సైతం రైతులకు సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. వారికి మద్దతుగా నిరసన ప్రదర్శనలను చేపడుతున్నారు. ఇదివరకు బ్రిటన్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయులు నిరసన ప్రదర్శనలు నిర్వహించగా.. ఈ సారి అమెరికా వంతు వచ్చింది.

 చంద్రుడిపైకి ఆస్ట్రో రాజా: హైదరాబాద్‌తో లింక్: తండ్రి ఉస్మానియా పూర్వ విద్యార్థి: నాసా లిస్ట్ చంద్రుడిపైకి ఆస్ట్రో రాజా: హైదరాబాద్‌తో లింక్: తండ్రి ఉస్మానియా పూర్వ విద్యార్థి: నాసా లిస్ట్

అమెరికాలో స్థిరపడిన వందలాదిమంది ప్రవాస భారతీయులు.. మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను చేపట్టారు. రాజధాని వాషింగ్టన్ డీసీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. వాషింగ్టన్‌లో భారీ ర్యాలీని నిర్వహించారు. రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్లను వినిపించారు. మూడు వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. రైతుల డిమాండ్లను నెరవేర్చాలని, భారత వ్యవసాయ విధానాన్ని కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టే చర్యలను మానుకోవాలంటూ పిలుపునిచ్చారు.

 Farm Bill protesters vandalise Mahatma Gandhi statue in Washington, Khalistan flags were seen

ఈ సందర్భంగా ఆందోళనకారులు రెచ్చిపోయారు. భారత రాయబార కార్యాలయం వద్ద గల జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహానికి రంగులు పూశారు. విగ్రహంపై బ్యానర్లను కప్పేశారు. ఈ నిరసన ప్రదర్శనల్లో ఖలిస్తాన్ జెండాలు కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఖలిస్తాన్ వేర్పాటువాదులు రైతుల నిరసన దీక్షలకు ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తోన్న వేళ.. వాటిని మరింత బలం కలిగించేలా ఖలిస్తాన్ జెండాలు పెద్ద సంఖ్యలో కనిపించాయి. ఖలిస్తాన్ పేరును ఆందోళనకారులు ఎక్కడా ప్రస్తావించలేదు.

Recommended Video

#FarmLaws: Is modi following the footsteps of former pm indira gandhi

ఈ ఘటన పట్ల వాషింగ్టన్ మెట్రోపాలిటన్ అధికారులు భారత రాయబార కార్యాలయానికి క్షమాపణలు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నేషనల్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో పలువురు ఆందోళనకారులపై కేసు నమోదైంది. వాషింగ్టన్ డిప్యూటీ కార్యదర్శి స్టీఫెన్ బీగన్ అమెరికాలోని భారత రాయబారి తరన్‌జిత్ సింగ్ సంధుకు ఫోన్ చేశారు. మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. భద్రతాపరమైన లోపాలు లేవని వివరించారు. ఆందోళనకారులు మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తారని ఊహించలేదని పేర్కొన్నారు.

English summary
Farm Bill protesters deface and vandalise Mahatma Gandhi statue near Indian Embassy at Washington DC in United States of America. Khalistan flags were seen at the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X