వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Covid-19: వైరస్‌కు వాటితోనే చెక్ పెట్టొచ్చు...పరిశోధకులు చెబుతున్న మెడిసిన్ ఏంటి..?

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు ఫార్మా కంపెనీలు ఈ మహమ్మారికి విరుగుడు మందును కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే పలు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి మందుల తయారీకి అనుమతులు కూడా వచ్చేశాయి. ఇక అప్పట్లో కరోనాకు విరుగుడు పారాసిటామాల్ అని చాలామంది ప్రముఖులు కూడా చెప్పారు. దీనికి ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా మద్దతు పలికింది. తాజాగా కరోనాకు విరుగుడు శరీరంలో క్రొవ్వును నియంత్రించేందుకు లేదా క్రొవ్వును తగ్గించేందుకు వినియోగించే మందులు వాడితే సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కొత్త పరిశోధన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

Recommended Video

Vitamin C Rich Foods To Beat Corona విటమిన్ సి అధికంగా ఉండే ఈ ఫుడ్ తీసుకుంటే కరోనా మీ దరి చేరదు...!!
 ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్

ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్

న్యూయార్క్‌లోని మౌంట్ సీనాయ్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు కోవిడ్-19 పేషెంట్ల శ్వాసకోశ వ్యవస్థను పరిశీలించారు. అయితే ఊపిరితిత్తుల్లో వారు కొంత మార్పును గమనించినట్లు చెప్పారు. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కార్బోహెడ్రేట్స్‌ను కరిగించడంలో వైరస్ అడ్డుకుంటుందన్న విషయాన్ని వీరు గమనించినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా పత్రిక టెలిగ్రాఫ్ ఒక రిపోర్టులో పేర్కొంది. అయితే దీనర్థం ఏమిటి..?

 ప్రస్తుతం ఉన్న మెడిసిన్స్‌తోనే వైరస్‌కు చెక్

ప్రస్తుతం ఉన్న మెడిసిన్స్‌తోనే వైరస్‌కు చెక్

ఊపిరితిత్తుల్లో కార్బోహైడ్రేట్స్ క్రొవ్వును నింపుతాయి. దీంతో ఇక్కడ వైరస్ అనేది పునరుత్పత్తి చెందుతుంది. ఇప్పుడు ఇదే కోవిడ్-19 పేషెంట్లకు సంబంధించి అనేక విషయాలని వివరిస్తుంది. బీపీ, అధిక కొలెస్ట్రాల్, మరియు డయాబెటిస్ వ్యాధులు ఉన్నవారే అధికంగా కోవిడ్-19 బారిన పడుతున్నారు. ఇక పరిశోధకులు దీనిపైనే ఫోకస్ చేశారు. ఇలాంటి వారిలో వైరస్ ప్రభావం ఎలా ఉంది ఏమేరకు ఉందనే విషయంపై పరిశోధనలు చేస్తున్న పరిశోధకులు దీన్ని ఆదిలోనే తుంచేందుకు లేదా కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఆదిశగా దీనిపై దృష్టి సారించారు. ప్రస్తుతం కరోనావైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ సక్సెస్‌ఫుల్‌గా వచ్చేందుకు మరింత సమయం పడుతుంది కాబట్టి ఆలోగ నష్ట నివారణ చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రస్తుతం ఉన్న ఔషధాలతోనే వైరస్‌కు చెక్ పెట్టేలా ప్రయత్నాలు ప్రారంభించారు.

 విరుగుడుగా ఫెనోఫైబ్రేట్ మెడిసిన్

విరుగుడుగా ఫెనోఫైబ్రేట్ మెడిసిన్

ఇక పరిశోధకులు చేసిన పరిశోధనల్లో కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధం ఫెనోఫైబ్రేట్ (ట్రైకార్) వైరస్‌కు చెక్ పెడుతుందనే డెసిషన్‌కు వచ్చేశారు. ఈ మెడిసిన్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంతో వైరస్‌ను నియంత్రిస్తుందని తద్వారా తిరిగి పునరుత్పత్తి కాకుండా కంట్రోల్ చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇక వీరు చేసిన పరిశోధనల్లో కోవిడ్-19 పేషెంట్స్‌కు ఫెనోఫైబ్రేట్ ఔషధం ఇవ్వగా కేవలం ఐదు రోజుల్లో వైరస్ వారినుంచి మాయమైందని చెప్పారు. అయితే ఈ ఔషధం వైరస్‌కు విరుగుడు అని కచ్చితంగా చెప్పేందుకు మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుందని చెప్పిన పరిశోధకులు దీనిపై ఆధారపడొచ్చనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

English summary
A simple cholesterol-lowering drug may reduce the threat of COVID-19 to that of the common cold, suggests new research.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X