వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్తమోడుతున్న ప్రియుడు.. వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేసింది

|
Google Oneindia TeluguNews

మిన్నెపోలిస్‌: అమెరికాలోని మిన్నెసోటాలో కారులోని వ్యక్తిపై ట్రాఫిక్‌ పోలీసు కాల్పులు జరపారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే కాల్పులు జరిగిన సమయంలో పక్కనే ఉన్న ప్రియురాలు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తూనే .. ఫేస్‌బుక్‌ లైవ్‌స్ట్రీమింగ్‌లో వీడియో పెట్టింది.

ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నంలోనే ఆమె ఈ విషయాన్ని లైవ్‌స్ట్రీమింగ్‌ ద్వారా స్నేహితులకు చేరవేసింది. బాధితుడిని 32ఏళ్ల ఫిలాండో కాస్‌టైల్‌గా గుర్తించారు. కాల్పుల అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.

ఫిలాంలో ట్రాఫిక్‌లో ఉండగా పోలీస్‌ అధికారి కాల్చి చంపినట్లు తెలుస్తోంది. అయితే కాల్పులు జరిపిన సెయింట్‌ ఆంథోనీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సదరు ట్రాఫిక్‌ పోలీసు వివరాలు తెలియరాలేదు.

తన ప్రియుడిని అకారణంగా చంపేశారని లావిష్‌ రేనాల్డ్స్‌ అనే మహిళ వాపోయింది. ఫిలాండో దగ్గర ఆయుధం ఉందని, దానికి సంబంధించిన లైసెన్స్‌ చూపించేందుకు వాలెట్‌ తీస్తుండగానే ఫిలాండోను పోలీస్‌ కాల్చాడని ఆమె వెల్లడించింది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, అకారణంగా ఓ వ్యక్తిని పోలీసులు చంపడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అమాయకులను చంపడాన్ని ఆపేయండంటూ నినాదాలు చేశారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటుండటంపై వారు నిరసన వ్యక్తం చేశారు.

English summary
A suburban Minneapolis police officer fatally shot a black man on Wednesday during a traffic stop, police said, and a woman posted a video on the internet saying he had been reaching for his licence and showing what she described as the aftermath of the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X