వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఖరి మార్చుకోండి లేదా బ్లాక్‌లిస్టులో పెడతాం: పాకిస్తాన్‌కు ఎఫ్ఏటీఎఫ్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చే సంస్థలపై డేగకన్ను వేసి అడ్డుకునే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) సంస్థ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చిరికలు జారీ చేసింది. ఎఫ్ఏటీఎఫ్ విధించిన 27 లక్ష్యాలను పాకిస్తాన్ అందుకోవడంలో విఫలమవడంతో ఇకపై జాగ్రత్తలు తీసుకోకపోతే బ్లాక్‌లిస్టులో చేరుస్తామని సంస్థ హెచ్చరించింది. ఇందుకు సమయం 4 నెలలు ఇచ్చింది.

ఫిబ్రవరి 2020 నాటికల్లా పాకిస్తాన్ ఒక ప్రణాళికను సిద్దం చేసుకుని దాన్ని అమలు చేయాలని సంస్థ చెప్పింది. అయితే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తీసుకుంటున్న చర్యలు చూస్తే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లే కనిపిస్తోందని భారత్ చెబుతోంది. బయటకు మాత్రం ఉగ్రవాదంను అణిచివేస్తున్నామని చెబుతున్న ఇమ్రాన్‌ఖాన్.. అతని చర్యలు చూస్తే అందులో సీరియస్‌నెస్ కనిపించదని చెప్పారు.

FATF warns Pakistan,says move swiftly or face blacklist

ఒక వేళ పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్టులో చేరిస్తే పాకిస్తాన్‌కు ఇతర దేశాల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు. అసలే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పాకిస్తాన్ ‌ను ఎఫ్ఏటీఎఫ్‌ బ్లాక్‌లిస్టులో చేర్చాలని భారత్ విపరీతంగా ప్రయత్నిస్తోందని గత నెలలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా పాక్ ప్రధాని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇరాన్ దేశం ఇప్పటికే ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్‌లిస్టులో కొనసాగుతోంది.

ఇరాన్‌పై యూరోపియన్ దేశాల ఏకాభిప్రాయం సన్నగిల్లిపోతుండటం, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతుండటంతో ఇరాన్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చింది. ఫిబ్రవరి 2020 లోగా ఎఫ్ఏటీఎఫ్ గైడ్‌లైన్స్ ప్రకారం ఇరాన్ తన వైఖరిని మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని సంస్థ పేర్కొంది.

English summary
The Financial Action Task Force, the global terror financing and money laundering watchdog, has severely indicted Pakistan for failing to deliver on most of its 27 targets and warned that the global body would be forced to blacklist it if Islamabad does not set its house in order within the next four months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X