వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెలబ్రిటీల న్యూడ్ ఫోటోల వెనుక అసలు కథ...!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజెల్స్: ఆస్కార్ అవార్డు గ్రహీత జెన్నిఫర్ లారెన్స్ న్యూడ్ ఫోటోలు ఆదివారం పలు సామాజికి వెబ్‌సైట్లలో రావడంతో లాస్ ఏంజెల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

జెన్నిఫర్ లారెన్స్ వాడే ఫోన్ ఆపిల్ కంపెనీది. ఆపిల్ కంపెనీ ఐక్లౌడ్ నుండి ఫోటోలను దొంగిలించారని ఆపిల్ కంపెనీ తెలిపింది. అందుకే ఈ కేసులో ఆపిల్ కంపెనీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీలకు సంబంధించిన ఐక్లౌడ్ సిస్టమ్‌కు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

FBI probes leak of nude pictures from Apple icloud

హ్యాకింగ్‌కి గురైన జెన్నిఫర్ లారెన్స్ ఫోన్‌ నుండి ఫోటోలను పలు సమాజిక వెబ్ సైట్స్ లో హ్యాకర్లు పోస్ట్ చేశారు. ఎఫ్‌బీఐ అధికారులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలా సెలబ్రిటీల ఫోటోలను ఫోన్స్‌, కంప్యూటర్ల నుండి హ్యాకర్లు దొంగిలించడంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. తమ న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసిన వారిని శిక్షించాలని జెన్నీఫర్ లారెన్స్ అన్నారు.

సామాజిక వెబ్‌సైట్లలో న్యూడ్ ఫోటోలు బయటకు వచ్చిన వారిలో సింగర్ రిహానా, అర్విల్ లావిగ్నే, అంబర్ హార్డ్, గాబ్రెల్లే తదితరులు ఉన్నారు. మొత్తంగా దాదాపు 400 మంది సెలబ్రటీస్ న్యూడ్ ఫోటోలు సామాజిక వెబ్‌సైట్లలో హ్యాకర్లు పోస్ట్ చేశారు.

English summary

 
 The FBI and Apple are investigating the hacking into the phones of Jennifer Lawrence and several other celebrities after nude photographs of the Oscar-winner were posted online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X