వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిల్లరీకి షాక్: ‘ప్రైవేట్ ఈమెయిల్స్ సర్వర్’పై ఎఫ్‌బీఐ దర్యాప్తు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. నవంబర్ 8న ఎన్నికలు జరగనున్న క్రమంలో శుక్రవారం ఎఫ్‌బీఐ ప్రకటన ఆమె మద్దతుదార్లను తీవ్ర నిరాశకు గురిచేసింది.

కాగా, ఈ ప్రభావం ఆమె గెలుపు అవకాశాలపై పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆమె హోంశాఖ కార్యదర్శిగా ఉన్న కాలంలో ప్రైవేట్ ఈ-మెయిల్ సర్వర్‌ను ఉపయోగించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో దర్యాప్తును పునరుద్ధరించాలని ఎఫ్‌బీఐ శుక్రవారం నిర్ణయించింది.

hillary clinton

మరిన్ని ఈ-మెయిళ్ళపై దర్యాప్తు చేయబోతున్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ ఓ చట్టసభ సభ్యునికి రాసిన లేఖలో తెలిపారు. ఈ దర్యాప్తు ఎంత వరకు కొనసాగుతుందో చెప్పలేమని పేర్కొన్నారు.

కాగా, ఒపీనియన్ పోల్స్‌లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ కన్నా హిల్లరీ క్లింటన్ ఆధిక్యత కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా, ఎఫ్‌బీఐ హిల్లరీ క్లింగన్ ఈమెయిల్స్ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు ముందుకు రావడం పట్ల డోనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు.

English summary
The FBI has said that it is investigating newly-discovered emails related to Democratic presidential candidate Hillary Clintons personal server.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X