వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్ న్యూస్: కోవిడ్-19 వ్యాక్సిన్‌ వచ్చేసింది: రెమ్‌డేసివీర్ డ్రగ్‌కు అమెరికా ఆమోదం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా ఆహార మరియు ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కరోనావైరస్ చికిత్సకు అత్యవసర పరిస్థితుల్లో రెమ్‌డేసివీర్ వ్యాక్సిన్‌ను వినియోగించొచ్చంటూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌పై పలు పరిశోధనలు పరీక్షలు నిర్వహించడం జరిగింది. కోవిడ్-19 బారిన పడిన కొంతమంది పేషెంట్లకు ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపిన వైద్యులు వారు త్వరగా కోలుకున్నారని చెప్పారు. దీంతో ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల కింద వినియోగించొచ్చంటూ ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది.

Recommended Video

COVID-19 Vaccine :FDA Allows Emergency Use Of Remdesivir For COVID-19 | Oneindia Telugu
 రెమ్‌డేసివీర్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం

రెమ్‌డేసివీర్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం


కోవిడ్-19 పేషెంట్లలో రెమ్‌డేసివీర్ వ్యాక్సిన్ మంచి ఫలితాలను చూపిందని వైద్యులు చెప్పారు. ఇక ఈ వ్యాక్సిన్ పై గత కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భారత్‌కు చెందిన ఫిజీషియన్ అరుణా సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. ఈ వ్యాక్సిన్ పలువురు కోవిడ్ పేషెంట్లకు ఇవ్వగా వారంతా కోలుకున్నారని వైద్యులు చెప్పారు. గిలీడ్ సంస్థ నుంచి వచ్చిన రెమ్‌డేసివీర్ అనే ఈ వ్యాక్సిన్ అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ఎఫ్‌డీఏ నుంచి అనుమతి లభించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనావైరస్ పేషెంట్లకు చికిత్స అందించేందుకు ఈ డ్రగ్ ఉపయోగపడుతుందని వెల్లడించారు.

వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు అమెరికా చొరవ చూపింది: ట్రంప్

వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు అమెరికా చొరవ చూపింది: ట్రంప్

కోవిడ్-19 పోరాటంలో ఈ డ్రగ్‌ను కనుగొనడం ఒక ముందడుగని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ అజార్ చెప్పారు. ఈ డ్రగ్‌ను అమెరికా దేశ వ్యాప్తంగా సరఫరా చేస్తామని చెప్పారు. అదే సమయంలో కోవిడ్-19 పేషంట్లకు చికిత్సలో భాగంగా అందజేస్తామని చెప్పారు. కోవిడ్ -19 బారిన పడిన పిల్లలు,యువతకు ఈ డ్రగ్‌ను అందిస్తామని చెప్పారు. ఇక ఎఫ్‌డీఏతో కలిసి ఈ వ్యాక్సిన్ త్వరతగతిన తీసుకొచ్చేందుకు అమెరికా ప్రభుత్వం కృషి చేసిందని ట్రంప్ చెప్పారు. ఇదిలా ఉంటే రెమ్‌డేసివీర్ కరోనావైరస్ పేషెంట్లకు చికిత్స అందించడంలో ఉపయోగపడుతుందని గిలీడ్ సంస్థ వెల్లడించింది. అయితే దీనిపై మరిన్ని క్లినకల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని సంస్థ తెలిపింది.

 కరోనావైరస్ తీవ్రతను బట్టి..

కరోనావైరస్ తీవ్రతను బట్టి..

ఇదిలా ఉంటే కరోనావైరస్ -19 తీవ్రతను బట్టి పేషెంట్‌కు 5 రోజులు చికిత్స అందించాలా లేదా 10 రోజుల పాటు చికిత్స అందించాలా అనేది నిర్ణయించడం జరుగుతుందని గిలీడ్ సంస్థ తెలిపింది. అయితే రెమ్‌డేసీవీర్‌కు ఎఫ్‌డీఏ ఇచ్చిన అనుమతి లేదా ఆమోదం కేవలం తాత్కాలికమే అని గిలీడ్ సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ భాగస్వాములతో కలిసి ఈ డ్రగ్‌పై మరిన్ని పరిశోదనలు చేస్తామని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు, వారికి చికిత్స అందిస్తున్న హెల్త్ కేర్ వర్కర్ల ఆరోగ్యం పట్ల తాము బాధ్యత తీసుకుంటున్నామని అందుకే పరిశోధనల్లో వేగం పెంచామని గిలీడ్ సంస్థ స్పష్టం చేసింది.

 జపాన్‌లో కూడా ఈ డ్రగ్ వినియోగించేందుకు...

జపాన్‌లో కూడా ఈ డ్రగ్ వినియోగించేందుకు...


ఇదిలా ఉంటే రెమ్‌డేసివీర్‌ డ్రగ్‌కు జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపేందుకు ప్రక్రియను ప్రారంభించింది. కోవిడ్-19 పేషెంట్లకు ఈ డ్రగ్‌తో చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవారం రోజుల్లో పూర్తి ప్రక్రియను కంప్లీట్ చేసి అంత సవ్యంగా ఉంటే ఆమోదం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు జపాన్ ప్రకటించింది. దీనికి ఆమోదం లభిస్తే జపాన్‌లో కోవిడ్-19 చికిత్సకు ఆమోదం పొందిన తొలి డ్రగ్‌గా రెమ్‌డేసివీర్ నిలుస్తుంది. ఇక కొన్ని హాస్పిటల్స్‌కు మాత్రమే ఇది సరఫరా ఉంటుందని జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

English summary
Gilead Science Inc's anti-viral drug remdesivir was granted emergency use authorisation by the U.S. Food and Drug Administration for Covid-19 on Friday, clearing the way for broader use of the drug in more hospitals around the United States
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X